Breaking News

ప్రజా సంక్షేమమే జగనన్న పాలసీ

-36వ డివిజన్ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రాజ్యంలో ప్రతిఒక్క కుటుంబానికి మంచి జరిగిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 36 వ డివిజన్ 192, 193, 195, 196 వ వార్డు సచివాలయాల పరిధి గాంధీనగర్ జింఖానా గ్రౌండ్ వద్ద జరిగిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్ తో కలిసి శుక్రవారం ఆయన పాల్గొన్నారు. తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఘన నివాళులర్పించి.. పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం సచివాలయ కార్యాలయంలో సంక్షేమ పథకాల బోర్డులను ఆవిష్కరించారు. తొలి సంస్కరణ గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ మొదలు జగనన్న ఆరోగ్య సురక్ష వరకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు విప్లవాత్మకమని మల్లాది విష్ణు అన్నారు. గత ప్రభుత్వంలో ఏ పనికైనా సిఫారసుల కోసం టీడీపీ నేతల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని.. కానీ ఈ ప్రభుత్వంలో అధికార యంత్రాంగమంతా ప్రజల గుమ్మం వద్దకే వస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశంలోని ఇతర రాష్ట్రాలను సైతం ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. 192 వ వార్డు సచివాలయ పరిధిలో గత నాలుగున్నరేళ్లలో డీబీటీ మరియు నాన్ డీబీటీ ద్వారా అక్షరాలా రూ. 4.96 కోట్ల మేలు చేకూర్చగా.. 193 వ సచివాలయ పరిధిలో రూ. 9.19 కోట్లు., 195 వ సచివాలయ పరిధిలో రూ. 5.40 కోట్లు., 196 వ సచివాలయ పరిధిలో రూ. 9.46 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రజల కొనుగోలు శక్తి బాగా పెరిగిందని పేర్కొన్నారు. కనుక ప్రజల ఆశీస్సులు తమ ప్రభుత్వానికి మెండుగా ఉన్నాయని.. చంద్రబాబు దుర్మార్గపు పాలనను ప్రజలు తిరిగి కోరుకోవట్లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు పులపా కృష్ణ, రామకృష్ణ, రెడ్యం ఆర్కే, రాడ భాస్కర్, యడ్ల రాంబాబు, పఠాన్ భూపతి, ఇప్పిలి శ్రీను, పప్పుల శివ, తాటి శివ, పార్టీ శ్రేణులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *