Breaking News

విజయ కీలాద్రి దివ్యక్షేత్రం లో ధనుర్మాస మహోత్సవములు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశ్రీశ్రీ ప్రదండి చిన్న జీయర్ స్వామి వారి పరిపూర్ణ మంగళ శాసనాలతో విజయ కిలాద్రి దివ్య క్షేత్రంపై ఆదివారం ధనుర్మాస మహోత్సవములు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.. ఈరోజు మొదటి రోజు శ్రీ గోదా అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన, సారె సమర్పణ, అనంతరం తీర్థ ప్రసాద గోష్టితో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగినది. ముఖ్యంగా ఈ ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా ఇంటింటి ధనుర్మాసం అనే విశిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టింది విజయకీలాద్రి అర్చక బృందం, విజయ కీలాద్రి శ్రీ గోదామ్మవారిని భగవత్ భక్తుల ఇంటికి తీసుకువెళ్లి వారి ఇంటి వద్దనే ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంతోమంది భక్తులు పాల్గొని ఆ గోదాదేవి అమ్మవారి అనుగ్రహాన్ని, స్వామివారి మంగళ శాసనాలను అందుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *