Breaking News

విజ‌య‌వాడ అర్బ‌న్‌పై ప్ర‌త్యేక దృష్టి

– 85 శాతం పోలింగ్ శాతం ల‌క్ష్యంగా వినూత్న స్వీప్ కార్య‌క్ర‌మాలు
– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ‌త ఎన్నిక‌ల్లో ఎన్‌టీఆర్ జిల్లాలో మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల‌తో పోల్చితే విజ‌య‌వాడ అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌క్కువ పోలింగ్ శాతం న‌మోదైంద‌ని.. ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ అర్బ‌న్‌లో పోలింగ్ శాతం పెంచేందుకు వినూత్న స్వీప్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు భార‌త ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ) అధికారుల‌కు వివ‌రించారు.
ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక సంక్షిప్త స‌వ‌ర‌ణ (ఎస్ఎస్ఆర్)-2024, సాధార‌ణ ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త కార్య‌క‌లాపాల‌పై శుక్ర‌వారం నోవాటెల్‌లో ప్రారంభ‌మైన స‌మీక్షా స‌మావేశం శ‌నివారం కూడా కొన‌సాగింది. ఈ స‌మావేశంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి సీనియ‌ర్ డిప్యూటీ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్లు ధ‌ర్మేంద్ర శ‌ర్మ‌, నితీష్ కుమార్ వ్యాస్‌; స్వీప్ డైరెక్ట‌ర్ సంతోష్ అజ్మేరా, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అవినాష్ కుమార్‌, అండ‌ర్ సెక్ర‌ట‌రీ సంజ‌య్ కుమార్‌, డైరెక్ట‌ర్ (ఎక్స్‌పెండిచ‌ర్‌) య‌శ్వీంధ్ర సింగ్‌తో పాటు ఏపీ చీఫ్ ఎల‌క్టోర‌ల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా, అడిష‌న‌ల్ చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ ఎంఎన్ హరేంధిర‌, జాయింట్ చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ ఎ.వెంక‌టేశ్వ‌ర‌రావు, స్టేట్ పోలీస్ నోడ‌ల్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో ఎస్ఎస్ఆర్-2024 పురోగ‌తి, ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌తపై ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు జిల్లా పురోగ‌తిని వివ‌రించారు. ఎస్ఎస్ఆర్‌-2024లో భాగంగా ఈ ఏడాది అక్టోబ‌ర్ 27 నుంచి డిసెంబ‌ర్ 19 వ‌ర‌కు ఫారం-6కు సంబంధించి 54,328, ఫారం-7కు సంబంధించి 53,775, ఫారం-8కు సంబంధించి 70,713 మొత్తం 1,78,816 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని.. వీటిలో 97.54 శాతం ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారం పూర్త‌యింద‌ని.. మిగిలిన వాటిని ఈ నెల 26లోగా ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు వివ‌రించారు. గత ఎన్నిక‌ల్లో తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో 86.70 శాతం, మైల‌వ‌రంలో 89.60 శాతం, నందిగామ‌లో 88.01 శాతం, జ‌గ్గ‌య్య‌పేటలో 89.53 శాతం పోలింగ్ న‌మోదైంద‌ని.. విజ‌య‌వాడ ప‌రిధిలోని ప‌శ్చిమ (66.17 శాతం)
, మ‌ధ్య (64.73 శాతం), తూర్పు (67.50 శాతం) నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా 85 శాతానికి చేర్చేందుకు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశాలు, వారి ఫిర్యాదుల ప‌రిష్కారం, ఫొటో, డెమోగ్రాఫిక్ సిమిలారిటీల ప‌రిష్కారం, డిస్పాచ్‌, రిసీట్‌, ట్రైనింగ్ సెంట‌ర్లు, ఎన్నిక‌ల సిబ్బంది, శిక్ష‌ణ త‌దిత‌రాల‌ను క‌లెక్ట‌ర్ డిల్లీరావు వివ‌రించారు.
పోలీస్ క‌మిష‌న‌ర్ కాంతిరాణా టాటా.. జిల్లాలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌, గ‌త ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ స‌మ‌యంలో ఉల్లంఘ‌న‌ల‌కు సంబంధించి న‌మోదైన కేసుల స్థితిగ‌తులు, అక్ర‌మంగా మ‌ద్యం, డ‌బ్బు త‌ర‌లింపుల‌ను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌లు, చెక్‌పోస్టుల ఏర్పాటు, స‌మ‌స్యాత్మ‌క, వ‌ల్న‌ర‌బుల్ పోలింగ్ స్టేష‌న్లు, తెలంగాణ‌తో స‌రిహ‌ద్దుల వ‌ద్ద తీసుకుంటున్న చ‌ర్య‌లు త‌దిత‌రాలపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *