Breaking News

కృష్ణా జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు నేటి వరకు 116 దరఖాస్తులు

-జిల్లా స్థాయి హౌసింగ్ కమిటీ ఏర్పాటు
-జనవరి 6లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని జర్నలిస్టులకు సూచన- జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించే ఇళ్లస్థలాల కోసం ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో 116 దరఖాస్తులు అందాయని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే జనవరి 6వ తేదీతో గడువు ముగుస్తున్నందున జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులందరూ ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ 2023 సం.లో అక్రిడిటేషన్ కార్డు కలిగిన అర్హులైన జర్నలిస్టులకు హౌసింగ్ స్కీమ్ క్రింద ఇంటి స్థలాలను అందించేందుకు ఇప్పటికే ప్రభుత్వం జీవో నంబర్ 535ను జారీ చేసిందని తెలిపారు. జీవోలో పేర్కొన్న నిబంధనల మేరకు అక్రిడిటేషన్ కార్డు పొందిన జర్నలిస్టుల వివరాలను, కనీసం 5 సంవత్సరాలు జర్నలిస్ట్ గా వారి వృత్తి అనుభవాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వారి కార్యాలయ అధికారులు పరిశీలించిన అనంతరం ప్రాథమికంగా ధృవీకరించి ఇప్పటివరకు 116 మంది జర్నలిస్టుల జాబితాను జిల్లాకు అందిందన్నారు. తదుపరి వెరిఫికేషన్ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఛైర్ పర్సన్ గా, జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ముగ్గురు జర్నలిస్టులు సభ్యులుగా, డిఐపిఆర్ఓ కన్వీనర్ గా జిల్లా స్థాయి హౌసింగ్ కమిటీ ఏర్పాటయిందని కలెక్టర్ తెలిపారు. ఈ కమిటీ జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించిందని తెలిపారు. రెవెన్యూ శాఖ వెరిఫికేషన్ చేసిన అనంతరం పూర్తిస్థాయిలో ఇళ్ల స్థలాలకు అర్హులైన జర్నలిస్టుల తుది జాబితా రూపొందించడం జరుగుతుందన్నారు. అక్రిడేటెడ్ జర్నలిస్టులకు కేటాయించే ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వ విలువ ప్రకారం 60 శాతం ప్రభుత్వం, 40 శాతం జర్నలిస్టులు చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేశారు.

అర్హులైన అక్రిడిటేడ్ జర్నలిస్టులందరూ వచ్చే జనవరి 6వ తేదీ లోగా ఆన్ లైన్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని, తద్వారా ప్రభుత్వం అందించే ఇళ్ల స్థలాలను అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టు పొందాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *