-మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిస్మస్ అంటే సేవ, శాంతి, సంతోషమని ఏసుక్రీస్తు క్షమా, ప్రేమ, శాంతి, కరుణ భావం కలిగిన వారు అని, ఏసు తన జీవితం ద్వారా మంచి మార్గంలో ఎలా నడవాలో చూపించారని అన్నారు. ప్రజలందరూ క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులు ప్రేమానురాగాలతో సంతోషాలను అందరికీ పంచాలని అన్నారు.
Prajavartha Online Telugu News