Breaking News

గెలుపోటములతో సంబంధం లేకుండా అభివృద్ధి చేస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వందే : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయలకతీతంగా సమగ్ర అభివృద్ధి జరుగుతుంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ వద్ద డిప్యూటీ మేయర్  బెల్లం దుర్గ ఆధ్వర్యంలో 90 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో, మరియు 13వ డివిజన్ ఇన్ ఛార్జ్ శ్రీ రామయనపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 27 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిడమనూరి వారి స్ట్రీట్,లుక్కా రామారావు స్ట్రీట్ వద్ద నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు, బీటీ రోడ్ నిర్మాణాలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు ఓడిపోయిన నియోజకవర్గలలో అసలు అభివృద్ధి గురుంచి పట్టించుకొనేవారు కాదని, ఓటు రాజకీయాలు చూసేవారు అని విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వం లో రాజకీయాలతో సంబంధం లేకుండా ఓడిపోయిన సరే తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని అన్నారు. ఈ 13వ డివిజన్ లో దాదాపు 6 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని తెలిపారు. గతంలో మాదిరిగా శంకుస్థాపన లకు పరిమితము కాకుండా ఎలాంటి నాణ్యత లోపం లేకుండా పనులు కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నామని అన్నారు. జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే టీడీపీ దాని తోక పార్టీలు అనుకూల మీడియా అడ్డుపెట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని విమర్శించారు. దమ్ము ధైర్యం ఉంటే మాతో వస్తే అభివృద్ధి అనేది చూపిస్తామని అవినాష్ సవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,13వ డివిజన్ ఇంచార్జ్ రామాయణపు శ్రీనివాస్,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు మరియు వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *