-డిసెంబర్ 9 వరకు వచ్చిన క్లైమ్ లను జాగ్రత్తగా పరిశీలించాలి : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక ఓటర్లు జాబితా సవరణ కార్యక్రమం – 2024 భాగంగా ఓటర్లు జాబితాను సంబంధించిన క్లెయిమ్స్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఈ ఆర్ ఓ లను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లో ఛాంబర్ నందు రాజకీయ పార్టీల ప్రతినిధులతో , ఈఆర్ఓలతో, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ తో కలసి సమావేశమయ్యాప్రత్యేక ఓటర్లు జాబితా సవరణ కార్యక్రమం – 2024 లో పక్రీయ పై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రోజువారి క్లెయిమ్ లను నాణ్యతతో పరిష్కరించాలని తెలిపారు. ఓటర్లు కు సంబంధించిన ఫోటో ఎంట్రీస్, డెమోక్రపికల్ ఎంట్రీస్ ను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఫామ్-7,8 క్లెయిమ్స్, అభ్యంతరాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని తెలిపారు. జిల్లా లోని ప్రతి నియోజకవర్గంలోనూ ఈఆర్వోలు, ఏఈఆర్వోల స్థాయిలోనే ఫామ్-6,7,8 దరఖాస్తుల విచారణలో ఎన్నికల కమిషన్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని క్వాలిటీ డిస్పోజల్ వుండాలి అన్నారు. మార్పులు చేర్పులకు సంబంధించిన జనవరి 22 వ తేదీన ఫైనల్ పబ్లికేషన్ జాబితాను విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కోదండ రామిరెడ్డి, శ్రీనివాసులు, సూళ్లూరుపేట, గూడూరు ఆర్డీఓ లు చంద్ర ముని, కిరణ్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరుల పాల్గోన్నారు.
Prajavartha Online Telugu News