Breaking News

వడ్డీ లేకుండా పన్ను చెల్లింపుకు 4 రోజులే గడువు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వడ్డీ లేకుండా ప్రస్తుత అర్ద సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లించే అవకాశం 4 రోజులు మాత్రమే (28,29,30,31 తేదీలు) మాత్రమే గడువు కలదని, పన్ను చెల్లింపుదార్లకు అనుకూలంగా క్యాష్ కౌంటర్లు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పని చేస్తాయని నగర కమీషనర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నగర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, 2023-24 రెండో అర్ధ సంవత్సరానికి వడ్డీ లేకుండా పన్ను చెల్లింపుకి ఈ నెలాఖరు వరకే గడువు ఉందని, నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంల్లోని క్యాష్ కౌంటర్లతో పాటు అదనంగా నగరంలోని భారత్ పేట 140 సచివాలయం, వసంతరాయపురం 148 సచివాలయం, పెద్ద పలకలూరు రోడ్ లోని 106 సచివాలయాల్లో కూడా పన్ను చెల్లించడానికి ప్రత్యేక క్యాష్ కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే డిశంబర్ 31 ఆదివారం చివరి రోజు కనుక సెలవు రోజు అయినప్పటికీ క్యాష్ కౌంటర్లు యధావిధిగా పని చేస్తాయన్నారు. కావున నగర పాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను చెల్లించి నగరాభివ్రుద్దికి సహకరించాలని కోరారు.
నగరపాలక సంస్థ సచివాలయ కార్యదర్శులు పన్ను బకాయిదార్లకు ప్రత్యేక స్లిప్ ల ద్వారా అందించాలని, ఫోన్ ల ద్వారా ప్రత్యేక కౌంటర్లు, క్యాష్ కౌంటర్ల సమయం గూర్చి సమాచారం ఇవ్వాలన్నారు. 31 తర్వాత బకాయిదార్లకు నీటి కుళాయిలు, అత్యవసర సేవల నిలుపుదల నోటీసులు, ఆర్.ఆర్. యాక్ట్ ద్వారా బకాయిల వసూళ్లకు నోటీసులు సిద్దం చేయాలన్నారు. పన్ను వసూళ్లు 50 శాతం వసూళ్లు చేయని అడ్మిన్ కార్యదర్శులు, ఆర్.ఐ., ఆర్.ఓ.లను టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *