విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి వారు నాబార్డ్ సహకారంతో గిరిజన అభివృద్ధి నిధి (ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్) ప్రాజెక్ట్ లో భాగంగా గత 12 సంవత్సరాల నుండి ఎ.కొండూరు, రెడ్డిగూడెం మండలాలలో ఉన్న 12 గ్రామాలలోని తండాల రైతులు ఆర్థికంగా ఎదగాలని అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అందులో బాగంగా ఈ రోజు ఏడుగురు రైతులకు 35 వేల రూపాయల చెక్కులను బెంజ్ సర్కిల్ నందు గల వాసవ్య మహిళా మండలిలో అందజేయడమైందని సంస్థ అధ్యక్ష్యులు డాక్టర్ బొల్లినేని కీర్తి పేర్కొన్నారు. రైతులు మరో 15 వేల రూపాయలను జతచేసి గొర్రెలు, మేకలు, పశువుల కొనుగోలు చేసి వారి కుంటుంబం ఆర్థికంగా ఎదగాలని ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని, ఇలా ఇది రొండవసారి రైతులకు సహకారాన్ని అందిస్తున్నామని ఆమె అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రజలనాడి తెలుసుకొని నాణ్యమైన ఉత్పత్తిని ఇచ్చినప్పుడు అధిక రాబడిని సొంతం చేసుకోవచ్చని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా కృష్ణారావు పాలెం నుండి వచ్చిన రైతు చక్రవర్తి మాట్లాడుతూ ఈ ఆర్థిక సహకారంతో మా జీవితాలలో మార్పు వస్తుందని, సహకారం అందించిన వాసవ్య మహిళా మండలి, నాబార్డ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి కార్యదర్శి జి. రశ్మి, సిబ్బంది కె.శ్రీనివాస రావు, టి. ధనుంజయ రావు మరియు రైతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News