విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం విజయవాడ, విద్యాధరపురం క్రీడా మైదానంలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్రా క్రీడల పోటీలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు పరిశీలించారు. స్వయంగా క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న 45 ఏళ్ల వ్యక్తిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి.. వారిని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీపడేలా తీర్చిదిద్దాలనే ఉన్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా క్రీడోత్సవాలను ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు పేర్కొన్నారు. క్రీడలను తమ జీవనశైలిలో భాగంగా చేసుకొని ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు యువతకు సూచించారు.
Prajavartha Online Telugu News