Breaking News

నూత‌న సంవ‌త్స‌రం శుభాకాంక్ష‌లు… : క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపేందుకు వ‌చ్చే అధికారులు, ఉద్యోగులు, ఆత్మీయులు, స‌న్నిహితులు బొకేలు, పుష్ప‌గుచ్ఛాలు, శాలువాల‌కు బ‌దులు నోట్ పుస్త‌కాలు, పెన్నులు వంటివి తీసుకురావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో విజ్ఞ‌ప్తి చేశారు. నోట్ పుస్త‌కాలు, పెన్నులు వంటి చిరుకానుక‌లు పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని.. పుష్పాలు, పండ్లు ఒక్క రోజుతోనే నిరుప‌యోగ‌మ‌వుతాయ‌ని.. ఒక పుస్త‌కం పేద విద్యార్థుల జీవితంలో విద్యా వెలుగులు నింపుతుంద‌ని.. అలాంటి గొప్ప కార్య‌క్ర‌మంలో మీరూ భాగ‌స్వాములు కావాల‌ని పేర్కొన్నారు. మీరిచ్చే పెన్నులు, పుస్తకాలు పేద విద్యార్థుల‌కు అందించడం జ‌రుగుతుంద‌ని.. వారి కృతజ్ఞ‌త‌లు, ఆశీస్సులు మీపై ఎప్ప‌టికీ ఉంటాయ‌ని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *