Breaking News

విజయవాడ నగర పాలక సంస్థ 2023 వార్షిక నివేదిక…

విజయవాడ(కార్పొరేషన్), నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ 2023 క్యాలెండర్ ఏడాది అభివృద్ధి అద్భుతమైన సంస్కరణలు అమలులోకి తీసుకొచ్చామని మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం కౌన్సిల్ హల్లో విజయవాడ నగరంలో 2023 సంవత్సరంలో జరిగిన వార్షిక అభివృద్ధిపై నివేదికను స్వప్సిల్ దినకర్, మేయర్ భాగ్యలక్ష్మీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, శైలజారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో వివరించారు. కమిషనర్ మాట్లాడుతూ నగరం లోని 64 డివిజన్ లలో ఈ సవంత్సరం చేపట్టిన, పూర్తి చేసిన అయా అభివృధి పసుల వివరాలు, సాధించిన ర్యాంకులు, పొందిన గుర్తింపులు వివరించారు. ఉద్యానవనం పట్టణ ప్రణాళిక విభాగం, పట్టణ సామాజిక అభివృద్ది, క్రీడలు, తాగునీటి సరఫరా, మురుగు నీరు పారుదల, మురుగు నీరు శుద్ధి, తదితర అంశాలపై ఆయన వివరించారు.

రోడ్ల నిర్మాణం మరియు మురమ్మతులు…
విజయవాడ నగరపాలక సంస్థ రూ.31 కోట్ల వ్యయంతో 15. 17 కిలోమీటర్ల సి.సి రోడ్డు 16.32 కిలోమీటర్లు తారు రోడ్లు పూర్తి చేసింది వీటితోపాటు 2.78 కోట్లు వ్యయంతో రోడ్ల సురమ్మతులు చేపట్టింది.

నీటి సరఫరా పనులు…
15వ.ఎఫ్.సి నిధులనుండి మాచవరం, గుణదల కార్మిక నగర్, క్రీస్తు రాజపురం, మొగల్రాజపురం ఫకీర్ గూడెం, కృష్ణానగర్, అంబేద్కర్ నగర్, దొంక రోడ్డులో రూ455,70 లక్షల వ్యయంతో 22 78 కిలోమీటర్ల హెళ్లిఎప్పి జీవో అండ్ డి ఏ పై పైపులైను ఏర్పాటు.. క్రీస్తు రాజపురం రోడ్ లోని ఎల్.ఐ.సి కాలనీ 6 నగర్ మైత్రి నగర్ ప్రాంతాల్లో 144,30 లక్షలు వ్యయంతో చేపట్టిన 0.72 కిలోమీటర్లు హెచ్.డి.పి ఈ జీవో అండ్ డీఏ పైప్ లైన్ లో అభివృద్ధి 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ 400 లక్షలతో 1500 కేఎల్ సామర్థ్యం గల మంచినీటి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారన్నారు.

స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులు…
43వ డివిజన్లో రూ. 140 లక్షల అంచనాలతో 700 మీటర్ల పొడవుతో అవుట్బాల్ రెయిన్ నిర్మాణం చేపట్టారు. 3 వ డివిషన్ లో మహానాడు రోడ్డు ఎన్హెచ్ జంక్షన్ నుంచి ఆటోనగర్ రోడ్డు వరకు తుఫాను నీటి కలవల నిర్మాణాన్ని సాధారణ నిధుల నుంచి 198, 70 లక్షలతో అభివృద్ధి చేస్తున్నారు. విజయవాడ నగర్ కార్పొరేషన్ సాధారణ నిధుల నుండి 9వ డివిజన్ లో కృష్ణవేణి రోడ్ లో రూ.31.00 లక్షలతో స్టామ్ వాటర్ బ్రైన్ నిర్మాణాన్ని అభివృద్ధి చేశారు.

భవన నిర్మాణ పనులు…
సర్కిల్ రెండు ప్రాంతంలో రూ. 139.80 లక్షలతో రెండు. సచివాలయ భవనాలను నిర్మించారు. సర్కిల్ 2 ప్రాంతంలో రు.103.46 లక్షలతో ఏడు శానిటరీ కార్యాలయాలను నిర్మాణం కోటితో పూర్తి చేసిన రెండు నెంబర్ల కమ్యూనిటీ భవనాల నిర్మాణం రూ.78,36 లక్షలు కోటి తో కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నారు. చలసాని నగర్ రాణి తోటలో 49.65 లక్షలతో భవనాన్ని నిర్మిస్తున్నారు. 109, 13 లక్షలతో 9 శానిటరీ ఇన్స్పెక్టర్ల కార్యాలయ భవనాలు నిర్మాణం వీటిలో 47.06 లక్షలతో నాలుగు భవనాలు పూర్తిగా నాలుగు పురోగతిలో ఉండగా ఒకటి నిర్మాణంలో ఉన్నాయి.

మన బడి నాడు-నేడు…
రూ.3349.00 లక్షలతో 12 ఉన్నత పాఠశాలలో ఆధునికరణ 9 ఉన్నత పాఠశాలలకు 155 అదనపు తరగతి గదులు నిర్మాణం చేపడుతున్నారు. సర్కిల్ 2 ఏరయాలో రూ -1018.38 లక్షలతో పూర్తయిన పనులను వెచ్చించారు. సరుల్ 3 ఏరియాలో రూ617.70 లక్షలతో 29 పాఠశాలలకు ఆధునికరణ ఆధుని వదవులు నిర్మాణం చేపడుతున్నారు.

పార్కుల అభివృద్ధి…
రూ.589,00 లక్షలతో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద గ్రీన్నరీ వర్టికల్ గార్డెన్స్ ఫౌంటెన్లు తదితరాలను అభివృద్ధి చేశారు. కనక దుర్గ నగర్ కాలనీ పార్యును 15 ఫైనాన్స్ గ్రాండ్ రూ.48.00 లక్షల నిధులతో పట్టీలు బ్లాక్ ఫౌండేషన్ నీటిపారుదల సౌకర్యాలు ఎంట్రన్స్ ప్లాజా తదితరులతో అభివృద్ధి చేశారు. డాక్టర్ కె. ఎలా దావు పార్కును రూ. 2:00 కోట్లతో ఇండోర్ షెడ్యూల్ కోర్టు పదవులు మరుగుదొడ్లు పచ్చదనం నీటి పారుదల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నారు. గాంధీజీ వద్ద రెండు కోట్లతో ప్లానిటోరియం రైల్ ట్రాక్ పార్కింగ్ ప్రాంతం కాంపౌండ్ వాల్ రిటైనింగ్ వాల్ లైబ్రరీ భవనం తదితరాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు.

సంక్షేమం, అభివృద్ధితో భవిష్యత్ ప్రణాళిక, వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో ప్రతినెలా 69,436 మందికి పింఛన్లు, జగనన్న అమ్మఒడికి 63,621 మంది లబ్ధిదారులు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *