Breaking News

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలుచేయాలి… : ఆర్‌.ఆర్‌.గాంధీ నాగరాజన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రక్షించండి ! రక్షించండి !! ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.!! బ్రతుకుదాం! బ్రతికిద్దాం!! బ్రతికితే దేశం కోసం చస్తే దేశం కోసం అనే నినాదంతో, మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేసిన జనవరి 30వ తేదీని పురస్కరించుకొని ప్రతి నెల 30వ తేదీన చేస్తున్న రీతిలోనే కళ్లకు గంతలు కట్టుకుని గాంధీ దేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు ఆర్‌.ఆర్‌.గాంధీ నాగరాజన్‌ సత్యాగ్రహ నిరాహారదీక్ష చేసారు. శనివారం ఊర్మిళానగర్‌ లోని ట్రస్ట్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాంధీ మహాత్ముని కలలు సాకారం కావాలంటే రానున్న ఎన్నికల్లోనైనా అన్ని రాజకీయపార్టీలు రానున్న పార్లమెంట్‌, శాసనసభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లను కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేసారు. స్త్రీ రక్షణ లేని ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం కాదని అన్నారు. ఓటు విలువ తెలుసుకుని మంచివారిని ఎన్నికల్లో ఎన్నుకునేలా రానున్న ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానని నేటి గాంధీ ఆర్‌.ఆర్‌.గాంధీ నాగరాజన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో గాంధీదేశం ట్రస్ట్‌ మహిళా అధ్యక్షురాలు ఆర్‌ఎన్‌.శివరంజని, ట్రస్ట్‌ ఏపీ అధ్యక్షురాలు బి.భారతి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *