Breaking News

2023 వార్షిక క్రైమ్ నివేదిక…నూతన సంవత్సర వేడుకలకు నగర ప్రజలకు సూచనలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా పరిధిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకోవడంతోనే 2023 లో నేరాల నియంత్రణ జరిగిందని పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా తెలిపారు. విజయవాడలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో 2023 వార్షిక క్రైమ్ నివేదికను వివరించారు. ఈ సందర్భంగా క్రాంతి రానా టాటా మాట్లాడుతూ గత ఏడాదితో పోల్చుతే నేరాల శాతం తగ్గిందన్నారు. హత్యలు కూడా 29 శాతం తగ్గాయన్నారు. అటెంప్ట్ మర్డర్ లు కూడా తగ్గాయన్నారు. కిడ్నాప్ లు కూడా తగ్గాయని చెప్పారు. నగరంలో ప్రెండ్లి పోలిసింగ్ నిర్వహించడం వలన కూడా నేరాల తగ్గుదల పట్టాయన్నారు. రౌడీ షీటర్ మర్డర్ కావడం కాని, రౌడీ షీటర్లు మర్డర్ లు చేయలేదన్నారు. అ సాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపడంతో పాటు నగర బహిష్కరణ చేసాం అని చెప్పారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచడం వలన నేరాలు ముఖం పట్టాయి అన్నారు. రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుదల పట్టాయన్నారు. మహిళలపై నేరాలు కూడా తగ్గాయన్నారు. ఫోక్సో కేసులు 3శాతం తగ్గాయన్నారు. నూతన సంవత్సర వేడుకలు అర్ధరాత్రి ఆరుబయట అనుమతులు లేవని తెలిపారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ సెక్షన్ 144 సి.ఆర్.పి.సి. అమలులో ఉన్నందున బహిరంగ ప్రదేశాలలో ఐదుగురు అంతకన్నా ఎక్కువ వ్యక్తులు గుమ్మిగూడటం నిషేధంగా చెప్పారు. కరోన కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంక్షలు తప్పనిసరన్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు…
ప్రధాన రహదారులైన బందరు రోడ్, ఏలూరు రోడ్, బి.ఆర్.టి.ఎస్. రోడ్లపై పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా తెలిపారు. అదేవిధంగా బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్, కనకదుర్గ పై ఓవర్ మరియు పి.సి.ఆర్. ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ అనుమతిచబడదన్నారు. క్లబ్బులు, రెస్టారెంట్లలో వేడుకలు నిర్వహించుకొనుటకు ముందస్తు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలన్నారు. నిర్వాహకులు సామాజిక దూరం ఇతర కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, సీటింగ్ కెపాసిటీలో 60 శాతం వరకు మాత్రమే అనుమతించేటట్లు నిబంధనలు పాటించాలన్నారు. ఆరుబయట ప్రదేశాలలో డి.జె.లు ఎక్కువ శబ్దాన్ని ఇచ్చే సౌండ్ సిస్టంను వినియోగించరాదన్నారు. మద్యం సేవించి రోడ్లపై వాహనములు నడుపరాదు, అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకొనబడునన్నారు. గుంపులు, గుంపులుగా చేరి నడి రోడ్డుపై కేకులు కోసి అల్లర్లు చేయరాదన్నారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి వేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరగ రాదన్నారు. జనవరి 1వ తేదీన నూతన సంవత్సర శుభాకాంక్షలు పరస్పరం తెలుపుకునేటప్పుడు మాస్కులు, శానిటైజర్లు వాడుతూ నిబంధనలు పాటించాలన్నారు.

హద్దుమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవు…
డిసెంబర్ 31వ తేదీన రాత్రి నగరంలో గస్తీ ముమ్మరంగా ఉంటుందనీ హద్దు మీరు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగాఉంటాయన్నారు. ద్విచక్ర వాహనాలకు సైలేన్సర్ తీసేసి అధిక శబ్దాలతో హోరెత్తించడటం, బాణాసంచా పేల్చడం వంటి వాటి వలన ప్రశాంతతకు భంగం కలిగి వృద్ధులకు, చిన్న పిల్లలకు, రోగులకు, ఇబ్బంది కలుగుతుంది. కావున ఇలాంటి వాటికి పాల్పడితే తగిన చర్యలు తీసుకొనబడునన్నారు. అధిక మత్తు వల్ల విచక్షణ కోల్పోయి దుర్మార్గపు పనులు చేసే అవకాశం ఉంది. అలాగే ప్రమాదాలు సంభవించి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా. ఈవ్ టీజింగ్ కు పాల్పడినా చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోబడునన్నారు. తల్లిదండ్రులు ఈవిషయాలను గమనించి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలసిన అవసరం ఉందన్నారు.

యన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ 1861 ప్రకారం నిషేధాజ్ఞలు అమలు
యన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో ప్రజా జీవనానికి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా సజావుగా శాంతిభద్రతలు పరిరక్షించడానికి పోలీస్ కమీషనర్ మరియు మెట్రోపాలిటన్ ప్రాంత అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్., నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో ది.01.01.2024వ తేదీ నుండి ది.31.03.2024వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్1861 ప్రకారం 91 రోజులు పాటు నిషేధాజ్ఞలు అమలు లో ఉంటాయి. నిషేధాజ్ఞలు అమలు ఉన్న సమయంలో పోలీస్ కమీషనరేట్ పరిధి లో ఎటువంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు, నిరసన మరియు ధర్నా కార్యక్రమాలును పోలీస్ వారి ముందస్తు అనుమతి లేకుండా నిర్వహించరాదు. నిషేధాజ్ఞలు అతిక్రమించి నిర్వహించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకొనబడునన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *