Breaking News

రాకేష్‌ పబ్లిక్‌ స్కూల్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాకేష్‌ పబ్లిక్‌ స్కూల్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ, ఆంధ్రప్రదేశ్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సమక్షంలో వివిధ రాష్ట్రాల సాంప్రదాయ నృత్యాలలో పాల్గొన్న విద్యార్ధులకు బహుమతుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. శనివారం పశ్చిమ నియోజకవర్గంలోని సిండికేట్‌ బ్యాంక్‌ కాలనీ, కె.ఎల్‌.రావునగర్‌లోని రాకేష్‌ పబ్లిక్‌ స్కూల్‌ సెమినార్‌ హాల్‌లో ముఖ్య అతిధిగా జస్టిస్‌ జి.శ్యామ్‌ప్రసాద్‌ హాజరై క్యాలెండర్‌ ఆవిష్కరణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సమక్షంలో వివిధ రాష్ట్రాల సాంప్రదాయ నృత్యాలలో పాల్గొన్న విద్యార్ధులకు బహుమతుల ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్‌భవన్‌లో నృత్యాలలో పాల్గొన్న విద్యార్ధులను అభినందించారు. రాకేష్‌శర్మ, అబ్దుల్‌ కలాం, సి.వి.రామన్‌ అంతటి వారు కావాలని ఆకాంక్షించారు. పాఠశాల అధినేత ఎన్‌.వి.రావ్‌ను ఉపాధ్యాయులను అభినందించారు. ఏదైనా విద్యా సంస్థలు అభివృద్ధి సాధించాలంటే విద్యతో పాటు ఆటలు, వివిధ కళలలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిశగా కృషిచేస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. పాఠశాల అధినేత ఎన్‌.వి.రావ్‌ మాట్లాడుతూ విద్యార్దులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్ధులలో దాగివున్న టాలెంట్‌ను వెలికి తీయవచ్చని తెలియజేశారు. ఈ విధంగా జరపటం వలన పిల్లలలో సృజనాత్మకత పెరుగుతుందని అదే విధంగా వారిలో విద్యపట్ల కొత్త విషయాలు నేర్చుకోవటంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిధి ప్రముఖ న్యాయవాది పిళ్ళా రవి, బాయనశేఖర్‌బాబు, స్కూల్‌ కో ఆర్డినేటర్‌ కె.రమేష్‌, నగర ప్రముఖులు, విద్యార్దినీ, విద్యార్దులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *