-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంగరంగ వైభవంగా నిర్మాణం అవుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం ముఖద్వారం త్వరగా పూర్తి చేయమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం పనులను పరిశీలించి అక్కడున్న ప్రాజెక్ట్ మేనేజర్లకు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, ముఖద్వారం దగ్గర ఉన్న కారిడార్ పనులు అత్యంత వేగవంతంగా నాణ్యత ప్రమాణాలు లోపించకుండా చేయాలని, టెర్రస్ లో జరుగుతున్న సాండ్ స్టోన్, గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి అన్నారు. ముఖద్వారంలో జరుగుతున్న పెయింటింగ్ వుడ్ వర్క్ పనులు దగ్గరుండి పరిశీలించారు. విజయవాడ నగర ప్రజలకు పర్యాటక ఆకర్షణగా ఉండే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం పనులు అత్యంత సుందరంగా నాణ్యత ప్రమాణాలు లోపించకుండా గడువు లోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 19న ప్రారంభిస్తున్న శుభతరుణంలో సర్వoసిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
Prajavartha Online Telugu News