Breaking News

ఈనెల 22న ఫోటో ఓటర్ల తుది జాబితా ప్రకటించుటకు అన్ని చర్యలు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 22న ఫోటో ఓటర్ల తుది జాబితా ప్రకటించుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, ఎన్నికల ముందస్తు కార్యక్రమాలపై తీసుకుంటున్న చర్యలు వివరించారు. ఈనెల 22 నాటికి ఫోటో ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పెండింగ్ లో వున్న 6, 7, 8 ఫారాల పరిష్కారం, ఓటర్ల నమోదు ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు. జిల్లాలో 1763 పోలింగ్ కేంద్రాలు (1012 ప్రదేశాలలో )ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కొన్ని మోడల్ పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసేందుకు వాటిని గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి గ్రామంలో ఈవీఎం ల ద్వారా ఓటు వేయడం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు, ఇప్పటివరకు 475 గ్రామాల్లో పూర్తయిందన్నారు. ఎన్నికల సెక్టోరల్ అధికారులుగా నియమించబడిన వారందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈనెల 9, 10 తేదీలలో భారత ఎన్నికల సంఘం అధికారుల బృందం విజయవాడ రానున్నారని, జిల్లా ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. గత ఎన్నికలలో తక్కువ పోలింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటికి కారణాలు తెలుసుకొని, ఈసారి పోలింగ్ శాతం పెంపునకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి పెడతామన్నారు. జిల్లాలో ఓటర్ల అవగాహన కోసం విస్తృతంగా స్వీప్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం అంబాసిడర్ గా నియమించిన ఆర్చరీలో గోల్డ్ మెడల్ విజేత జ్యోతి సురేఖతో కలసి స్లీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పెద్దిరోజా, వైఎస్ఆర్సిపి, టిడిపి, ఐ ఎన్ సి, సిపిఐ ఎం, బిజెపి ప్రతినిధులు షేక్ సిలార్ దాదా, బత్తిన దాస్, సత్యనారాయణ, కొడాలి శర్మ, పంతం గజేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సమన్వయ అధికారి సురేష్, డిటి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *