Breaking News

ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంసిద్ధం కావాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు నోడల్ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా ఎన్నికల అధికారి నగరంలోని కలెక్టర్ ఛాంబర్ లో ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వీలుగా 16 మంది సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించామన్నారు. త్వరలో నోడల్ అధికారులు అందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా అందరూ ఎన్నికల విధులపై దృష్టి సారించాలన్నారు. రోజువారిగా శాంతిభద్రతలు పర్యవేక్షించాలన్నారు. ఓటర్లను చైతన్య పరిచే అవగాహన కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఓటర్ల జాబితా నిరంతరం సవరించే ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. పోలింగ్ నిర్వహణ అధికారులు సిబ్బంది నియామకం రాండమైజేషన్ తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ అధికారులు సిబ్బందికి రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఏజెంట్లకు అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే విషయమై ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలను గమనించాలన్నారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన సామాగ్రిని సమకూర్చుకునేందుకు ఇప్పటినుంచి సరైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల అధికారులను పోలింగ్ అధికారులు, సిబ్బందిని సామాగ్రిని తరలించేందుకు అవసరమైన వాహనాలు, పడవలు, పంటులు వాటి వివరాలను సేకరించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన యాప్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రాండమైజేషన్ కమిషన్ పంపిణీ, సీలింగు, రవాణా తదితర అంశాలపై సరైన అవగాహన పెంచుకోవాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశాక ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎం సి సి ఎన్నికల కోడ్) అమలులోకి వస్తుందని ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అభ్యర్థులు తమ ప్రచారం కోసం వివిధ పద్ధతుల్లో చేస్తున్న ఖర్చును సజావుగా లెక్కలు చూపే విధంగా వ్యయ పర్యవేక్షణ చేయాలన్నారు. బ్యాలెట్ పత్రాలు పోస్టల్ బ్యాలెట్ పత్రాలు ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పత్రాలు తయారీ వినియోగంపై సంసిద్ధం కావాలన్నారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో చెల్లింపు వార్తలు, ప్రకటనల పరిశీలించి అభ్యర్థుల ఖర్చు కింద చూపేందుకు, మీడియా కేంద్రం తెరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సమాచారం మీడియాకు ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. ఎన్నికల అధికారుల మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లోపం లేకుండా సరైన ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణపై ఏ ఫిర్యాదులు వచ్చినా సకాలంలో పరిష్కరించేందుకు, ఓటర్లకు సహాయం చేసేందుకు వీలుగా హెల్ప్ లైన్ నంబర్ 1950 నిర్వహణపై సంసిద్ధం కావాలన్నారు. ఎన్నికల పరిశీలకుల రాకపోకలు, వారి వసతి సౌకర్యాలు భద్రత తదితర ఏర్పాట్లను చేయాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ డి ఆర్ ఓ పెద్ది రోజా నోడల్ అధికారులు, జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, డి సి ఓ ఫణి కుమార్, ఎన్ ఐ సి డిఐఓ ఫణి కృష్ణ, గుడివాడ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, సర్వ శిక్ష ఎపిసి శ్రీరాములు నాయక్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సునీత తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *