మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈ జనవరి నెల నుండి 2,45,783 మంది లబ్ధిదారులు 3 వేలరూపాయల పింఛను పొందుతున్నారని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వెల్లడించారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడలో వైయస్సార్ పింఛను కానుక 3 వేల రూపాయల పెంపుదల కార్యక్రమాన్ని వర్చువల్ పద్ధతిలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని కలెక్టరేట్ విసీ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పింఛను లబ్ధిదారులకు రు.72.52 కోట్ల మెగా నమూనా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ పింఛను కానుక కింద జిల్లాలో 2,45,783 మంది పేద వృద్ధులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చర్మకారులు, చేనేత కార్మికులు, వితంతువులు, కళాకారులు, దివ్యాంగులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సామాజిక భద్రత కింద వారిని ఆదుకునేందుకు 3వేల రూపాయల చొప్పున 72 కోట్ల 52 లక్షల 39వేల రూపాయల పింఛన్ ను అందజేస్తుందన్నారు. ఇందులో 2019 నుండి ఇప్పటివరకు 89,867 పింఛన్లను కొత్తగా మంజూరు చేయడం జరిగిందన్నారు. జనవరి నెల నుండి నెలవారి పింఛను 2750 రూపాయల నుండి 3 వేల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. ఈ జనవరి నుండి కొత్తగా 3,913 మందికి పింఛన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో అవనిగడ్డ నియోజకవర్గంలో కొత్తగా 725 పింఛన్లు, గన్నవరం నియోజకవర్గంలో 464 పింఛన్లు, గుడివాడ నియోజకవర్గంలో 477 పింఛన్లు, మచిలీపట్నం నియోజకవర్గంలో 534 పింఛన్లు, పామర్రు నియోజకవర్గంలో 585 పింఛన్లు, పెడన నియోజకవర్గంలో 466 పింఛన్లు, పెనమలూరు నియోజకవర్గంలో 662 పింఛన్లు మంజూరయ్యాయన్నారు. కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కొందరి పింఛనుదారుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి:
1. ఎం వనమహాలక్ష్మి గాంధీనగర్ మచిలీపట్నం
————————తన భర్త చనిపోయాడని, కొడుకులు లేరని, కుమార్తె వేరే ఊర్లో ఉంటుందని ఎలాంటి ఆదరువు లేక
గతంలో తాను వృద్ధాప్య పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులు పడ్డానన్నారు. 2020లో తనకు కొత్త ప్రభుత్వం పింఛను మంజూరు చేసిందన్నారు. అంతే కాకుండా ఇంటి స్థలము వచ్చిందన్నారు. రేషన్ బియ్యం ఇంటి వద్దకే తీసుకొచ్చి అందిస్తున్నారన్నారు. అలాగే కంటి ఆపరేషన్ కూడా ఉచితంగా ప్రభుత్వం చేయించిందన్నారు. పింఛను ఇచ్చి అన్ని విధాల ఆదుకుంటున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
2. చందలూరు నాగదుర్గ చిలకలపూడి మచిలీపట్నం
———————-
మాట్లాడుతూ తన భర్త చనిపోయి 15 సంవత్సరాలు అవుతుందని, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని టైలరింగ్ చేసి జీవనం గడుపుతున్నానని, అమ్మఒడితో ఇద్దరి పిల్లలను చదివించుకుంటున్నానని, పించను 3 వేలరూపాయలకు పెంచినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
టేకి రాము, చిలకలపూడి మచిలీపట్నం
———————
మాట్లాడుతూ తనకు 20 సంవత్సరాల నుండి వృద్ధాప్య పింఛను వస్తుందని, తనకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారని, తనకు మందులు తెచ్చుకొనుటకు పింఛను సొమ్ము ఉపయోగపడుతుందని పింఛను 2750 నుండి 3 వేల రూపాయలకు పెంచడం చాలా సంతోషంగా ఉందని, పెంచిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరమ్మ ఉపమేయర్ విజయలక్ష్మి రాష్ట్ర ఉర్దూ అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ షేక్ దిల్షాద్ నజరానా డి ఆర్ డి ఏ పి డి పి ఎస్ ఆర్ ప్రసాద్ స్థానిక నాయకులు పేర్ని కృష్ణమూర్తి సచివాలయ సిబ్బంది పలువురు పెన్షన్ దారులు పింఛనుదారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News