Breaking News

నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన చికిత్సలు

-మంత్రి జోగి రమేష్

పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
సరైన వైద్య సేవల కోసం గతంలో గతంలో ఊరూర తిరిగేవారమని, ఇప్పుడు నయా పైసా ఖర్చు లేకుండా మెరుగైన చికిత్సలు ప్రభుత్వ ఖర్చుతో చేస్తామంటూ డాక్టర్లే ఇళ్ల వద్దకు వస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు పెడన పట్టణంలో 3వ సచివాలయ పరిధిలో వినాయకుడి గుడి వద్దనున్న కర్ణభక్త కళ్యాణ మండపంలో 7 8 9 వార్డులలో 128 మంది ప్రజలు వివిధ రకాల వైద్య సేవలు పొందేందుకు రిజిస్టర్ అయ్యారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ రెండో దశ ప్రారంభం
పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం చేపట్టిందన్నారు. గతేడాది నవంబర్‌లో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ మొదటి విడతను చేపట్టిన ప్రభుత్వం నిన్నటి నుంచి. ( జనవరి 2) రెండో విడతను ప్రారంభించిందన్నారు. రెండో దశ 6 నెలల పాటు నిర్వహించనున్నారన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. గత ఏడాది అక్టోబర్ నెల
తొలిదశలో 12,423 ఆరోగ్య శిబిరాల్ని నిర్వహించారన్నారు. తద్వారా 1,64,982 మంది పేషెంట్లకు వైద్య సేవలను అందించారని తెలిపారు. నాణ్యమైన ఆరోగ్య సేవలను ఉచితంగా అందించే విషయంలో ఏ ఒక్క గ్రామాన్ని కూడా వదిలిపెట్టొద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్యారోగ్య శాఖను ఆదేశించారన్నారు. మొదటి విడత 50 రోజుల్లో పూర్తి కాబడిందని ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ సాధనకు జగన్ ప్రభుత్వం శాఖ విశేష కృషి చేస్తోందన్నారు.

కృష్ణాజిల్లాలో 641 గ్రామాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు కొనసాగుతాయి అన్నారు. 14 రకాల జబ్బులకు వైద్యం లభిస్తుందని 105 రకాల మెరుగైన మందు ప్రజలకు ఉచితంగా అందించనున్నట్లు మంత్రి జోగి రమేష్ తెలిపారు. అనారోగ్యం పాలై ఇంటి నుండి కదలలేని పరిస్థితుల్లో ఉన్న రోగులకు సైతం పోస్టల్ శాఖ ద్వారా మందులను ఉచితంగా ఇంటికి ప్రభుత్వం పంపనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం మంత్రి జోగి రమేష్ పలువురికి ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పెడన మున్సిపాలిటీ చైర్పర్సన్ కటకము నాగకుమారి, వైస్ చైర్మన్లు మహమ్మద్ ఖాజా, బైలపాటి జ్యోతి, జిల్లా వైద్య శాఖ అధికారిణి జీ. గీతాబాయి, జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ సతీష్, 6 వ వార్డు కౌన్సిలర్ బాబూలాల్, 8 వ వార్డ్ కౌన్సిలర్ కటకం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *