విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇచ్చిన హామీ నెరవేరుస్తూ వృద్ధాప్య పెన్షన్ ను దేశంలోనే అత్యధికంగా రూ. 3 వేలకు పెంచి ఇస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.బుధవారం నాడు 17,18 డివిజన్ల సంబందించి రాణిగారితోట,సిమెంట్ గౌడన్ నందు పెన్షన్ రెండు డివిజన్ల కి 2,206 పెన్షన్లు చెక్కు ని లబ్దిదార్లుకు అందజేశారు.ఈ సందర్భంలో దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాష్టంలో ప్రతి నెలా రూ. 2 వేల కోట్ల ఖర్చుతో 66.34 లక్షల మందికి గడప వద్దకే పెన్షన్లు ఇస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని అన్నారు. గతంలో పింఛన్ రావాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకునే పరిస్థితి.. నేడు లంచాలు, వివక్ష లేకుండా పెన్షన్ ఇస్తున్నాం అన్నారు. జగన్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ రూ.3 వేలకు పెంచాం. నూతన సంవత్సరం అంటే తేదీ మారడం కాదు పేదలు, వృద్దుల జీవితాలు మారాలి. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి అన్నారు.జగనన్న సైన్యం వాలంటీర్లు. వారి ద్వారానే సమయానికి పెన్షన్ పంపిణీ చేయగలుగుతున్నాం అని, గతంలో పెంఛన్ కావాలంటే పడిగాపులు పడాలని, పింఛన్ కావాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదాని, పింఛన్ తీసుకోవాలంటే లైన్లలో నిలబడాలని గురక్తు చేశారు.స్థానిక శాసనసభ్యులు వస్తారు ఫోటోలు దిగి షో చేసి వెళ్ళిపోతారు. కరోన టైం లో కూడా రోడ్లు మీద తిరిగి సేవలు చేసింది వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే.కరోన సంక్షోభం ఉన్న పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. ఒకవైపు లంచాలు, మరోవైపు వివక్ష, మరో వైపు చెంతాడంత క్యూలైన్లు, ఈ రోజు ఎవరికి పింఛన్ కావాలన్నా అర్హత ఉంటే చాలు మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియు డివిజన్ ప్రెసిడెంట్లు,వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News