విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీ సబ్ ప్లాన్ నిధులను 75000 కోట్లు పక్కదారి , 56 బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్లు తగ్గించి 16800 మంది బీసీలు ప్రజాప్రతినిదులుగా ఎన్నిక కాకుండా, పెళ్లి కానుక , విదేశీ విద్యా , పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ , ఐఏఎస్ కోచింగ్ సెంటర్ల కుల చేతివృత్తుల వారికి ఆదరణ పథకల రద్దు జగన్మోహన్ రెడ్డి చేసిన అంశంపై కృష్ణన్నయ్య స్పందించాల్సింది. నేతన్నలను మత్స్యకారులను మోసం చేసిన వ్యక్తి సీఎం జగన్. కృష్ణయ్య బీసీల అభివృద్ధి సంక్షేమం కోసం ఉద్యమించాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాంటి పెట్టుబడి పెత్తందారుల పల్లకి మోస్తే బీసీలు చూస్తూ ఊరుకోరు.
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ బీసీలకు జగన్ మోహన్ రెడ్డి మేలు చేశారని, బీసీల బతుకులు మార్చిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని రాజ్య సభ సభ్యులు మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు R. కృష్ణయ్య మాట్లాడడం చాలా ఆశ్చర్యకరంగా, హాస్యాస్పదంగా ఉందని, ఈ సంధర్బంగా కృష్ణయ్య ని ఒకటే అడుగుతున్నా ఈ రాష్ట్రంలో బీసీలను అభివృద్ధి చెయ్యడం అంటే మీ ఒక్కరికే ఎంపీ సీట్ ఇచ్చి రాజ్యసభ కు పంపిస్తే బీసీలు అందరూ అభివృద్ధి చెందినట్ల మీరు ఈ విధంగా మాట్లాడడం బీసీలు ఎవరూ హర్షించట్లేదు అని ఈ సంధర్బంగా తెలియజేస్తున్నామని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీల వెన్ను విరిచి బీసీల జీవితాలు సర్వనాశనం చేసినఅంశాల మీద నేను మీతో బహిరంగ చర్చకు సిద్ధం అని,స్థానిక సంస్థల ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి బీసీలకు 34శాతం వున్న రిజర్వేషన్ను 24శాతానికి తీసుకువచ్చి 16,800మంది బీసీ సోదర సోదరీమణులు కు ప్రజా ప్రతినిధులుగా కాకుండా అడ్డుకున్న మాట వాస్తవం కాదా అని? బీసీ సబ్ ప్లాన్ నిధులను బిసి సంక్షేమ అభివృద్ధి కి ఉపయోగించకుండా ఇంతర పథకాలకు 75వేల కోట్లు మళ్లించిన mata నిజమా కాదా 56 బీసీ కార్ప్రేషన్లు ఏర్పాటు చేసి ఒక్క పైసా నిధులు కూడా కేటాయించ కుండా బీసీలకు ఒక్క సబ్సిడీ రుణం ఇయ్యకుండా బీసీ లను మోసం చేసిన మాట నిజమా కాదాఅని, సెంటు భూమి పథకం కింద బీసీల ఆధీనంలో ఉన్న 8వేల ఎకరాల అసైన్డ్ భూములు లాక్కుని ఎనిమిది వేల పైచిలుకు బీసీల జీవితాలను జగన్ మోహన్ రెడ్డి సర్వనాసానం చేశారని, ఈ అంశం మీద కూడా మాట్లాడాలి అని, బీసీలకు జగన్ మోహన్ రెడ్డి ఒక్క పధకం ఐనా పెట్టారాఅని, వున్న పదకాలన్నీ తేసేసారని వీటి మీద సమాధానం చెప్పాలని, బీసీల పెళ్ళి కానుక పధకం , విదేశీ విద్యా పథకం ఐఏఎస్,ఐపిఎస్ పోటీ పరిక్షలకు కోచింగ్ సెంటర్లలో చదువుకునే విద్యార్థుల పథకం రద్దుచేశారని, బీసీ విద్యార్థులు పీజీ చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రద్దు చేశారని, బీసీ కుల వృత్తి దారులకు ఒక్క పనిముట్టు కూడా ఇవ్వలేదని, సబ్సిడీ రుణాలు ఎత్తేశారని వీటన్నిటి మీద మీరు ఎక్కడైనా మాట్లాడారా అని, ప్రతిపక్షాలు కబ్దార్ అని మాట్లాడుతున్నారు ఆ మాట ఏవిధంగా అనగలుగుతున్నారని, మేము అడిగిన ప్రతి అంశం మీద మీరు స్పందించాలని, కొన్ని వందల స్కూల్ బిల్డింగ్ ల స్థలాలను తనకా పెట్టీ పేద సామాన్య వర్గాల పిల్లలు చదువు కోకుండా చేసిన మాట వాస్తవం కాదా విలీనం పేరుతో చాలా స్కూల్స్ ఎత్తేసినమాట నిజం కాదాఅని, అప్పుడు బీసీ విద్యార్థులు నష్టపోలేదా దీనిమీద మీరు మాట్లాడాలని ఇవేమీ మాట్లాడకుండా జగన్ మోహన్ రెడ్డి బీసీల బతుకులు మార్చారు అని మీలాంటి ఉద్యమకారులు మాట్లాడడం బీసీలు ఎవరు జీర్నించుకోలేకున్నారని దీనిమీద మీరు స్పందించాలని, చేనేతలకి జీఓ నెంబరు 65 ద్వారా మోసం చేసిన మాట నిజం కాదా అని,మత్స్యకారులకి జీఓ నెంబరు 215 ఇచ్చి వాళ్ళ హక్కులని కాల రాసిన మాట వాస్తవం కాదా అని,బిసీలను ఇంత వంచించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి కన్నా చరిత్రలో మరొకరు లేరని బీసీలను అన్ని రకాలుగా మోసం చేస్తూ వారిని కేవలం ఓటు బ్యాంకు గా వాడుకుంటున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని, బీసీ ల హృదయాలలో జగన్ మోహన్ రెడ్డి కి స్థానం లేదనే కదా ఈ రోజు మీరు వచ్చి ఏదో కులాల సమ్మేళనం అని మాట్లాడుతున్నారని, బీసీల వెన్నుపోటు దారుడుగా, బీసీల ద్రోహిగా జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు అని మీలాంటి వ్యక్తులు ఎంత మంది వచ్చి జగన్ మోహన్ రెడ్డి పల్లకి మోయాలని చూసిన బీసీలు ఈ సారి జగన్ మోహన్ రెడ్డి ని ఆదరించే ప్రసక్తే లేదనీ బీసీల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి అని ఈ రోజు ప్రజలందరికీ తెలిసిపోయిందని ఈ విషయాలు అన్ని మీకు తెలిసినా ఇంకా మీరు బీసీలను మోసం చెయ్యాలని చూస్తే బీసీలు ఇకముందు మిమ్మల్ని కూడా ఆదరించరు లెక్క చెయ్యరనే వాస్తవాన్ని మీరు గ్రహించాలని మీకు నిజంగా బీసీల అభివృద్ధి, అత్మగౌరవం, రాజ్యాధికారం మీద చిత్తశుద్ది ఉంటే జగన్ మోహన్ రెడ్డి చేసిన మోసాలు మీద మీరు మాట్లాడాలి అని బీసీలకు అండగా నిలబడాలని సుదీర్ఘ కాలం పోరాటం చేశామని చెప్పే మీరు వాస్తవాలు మరుగున పెట్టొద్దు అని మీలాంటి ఉద్యమకారులను చూసి చాలా మంది ప్రేరణ స్ఫూర్తి పొందారని మీరు ఇట్లాంటి పెత్తందారీ,పెట్టుబడి దారులుకు పల్లకీలు మోస్తే కృష్ణయ్య ను బీసీలు ఏమాత్రం ఆదరించరని అన్నారు. పొట్నూరి శ్రీను, బోట్టా సాయికుమార్, s. నరేష్, బందు చూడే శ్రీను, బేతాళ రవికుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News