-ఘాట్ల వద్ద మెషిన్లను వాడండి
-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవాని దీక్ష విరమణ సమయంలో వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ్యంలో ఎటువంటి లోపాలు ఉండకుండా చూసుకోవాలని, ఘాట్ల వద్ద నిరంతరం మెషిన్లను వాడి భక్తులు విడిచిపెట్టే బట్టలను త్వరగా శుభ్రపరచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఉదయం భవాని దీక్ష విరమణ సందర్భంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించి భవానీదీక్ష విరమణ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి నగరాన్ని వచ్చు యాత్రికులకు కల్పించిన వసతులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగుకుండా చూడాలని, భవాని దీక్ష విరుముళ సమయం లో భక్తులు వదిలేసే వస్త్రాలను ఘట్ వద్ద నిరంతరంగా కన్వేయర్ బెల్ట్ ద్వార సేవలు ఉంచాలని, ఎక్కువగా మెషిన్లను వాడి పరిశుభ్రతను పాటించాలని చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావుని ఆదేశించారు.
క్షేత్ర స్థాయిలో పర్యటించి భక్తులకు కల్పించిన సదుపాయాలను పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. పుష్కర ఘాట్, సీతమ్మ వారి పాదాలు ప్రాంతాలలో పర్యటిస్తూ ఘాట్ వద్ద యాత్రకులు స్నానము ఆచరించుటకు అందుబాటులో గల సదుపాయాలు మరియు కేశఖండనశాల వద్ద ఏర్పాట్లు పరిశీలించి, పరిసరాలు అన్నియు ఎప్పటికప్పడు పరిశుభ్రంగా ఉండునట్లుగా చూడాలని సంబందిత ఇన్ ఛార్జ్ అధికారులను ఆదేశించారు.
భక్తుల క్యూ లైన్ ల వద్ద పరిశీలించి సానిటరీ ఇన్స్పెక్టర్లకు మరియు స్పెషల్ ఆఫీసర్లకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, 24 గంటలు, మూడు షిఫట్లలో పారిశుధ్య నిర్వహణ జరిపించాలని, సానిటరీ ఇన్స్పెక్టర్ లకు, స్పెషల్ ఆఫీసర్లకు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.త్రాగునీరు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంచాలని భక్తులకు ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలుగుకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఘాట్ల యందు మెరుగైన పారిశుధ్య పరిస్థితులను నెలకొల్పి ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. మరియు యాత్రికులకు అందుబాటులో ఉంచిన తాత్కాలిక మరుగుదొడ్లు ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలని కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
ఈ పర్యటనలో కమీషనర్ తో పాటు చీఫ్ ఇంజనీర్ యం ప్రభాకర్ రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ పి. రత్నావళి, హెల్త్ ఆఫీసర్-3 ఇక్బాల్ హుస్సేన్, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News