-స్పందన కార్యక్రమంలో అందినఫి 19 ఫిర్యాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధమ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లోవిజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 19 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ పరిధిలోని సమస్యలను అర్జీ రూపంలో కార్పొరేషన్ అధికారులకు సమర్పించగా సంబంధిత అధికారులు ఆ సమస్యకు సత్వర పరిష్కారం అందిస్తామని అన్నారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్ విభాగానికి 1, టౌన్ ప్లానింగ్ 8, ఆర్.యఫ్.ఓ-1, హెల్త్ -1, పిఒయుసిడి 4, ఎస్టేట్ 4, మొత్తం కలిపి 19 అర్జీలు, ప్రజలు నుండి అధికారులు దరఖాస్తు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్(ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం ప్రభాకర్ రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ రత్నావళి, సిటీ ప్లానర్ జీవి జీ ఎస్ వి ప్రసాద్, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) వెంకటలక్ష్మి, పి ఓ యు సి డి రోహిణి, ఏ డి హెచ్ శ్రీనివాస్, జాయింట్ డైరెక్టర్ అమృత్ లతా, అకౌంట్స్ ఆఫీసర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News