Breaking News

సొంత నిధులతో డివిజన్లో పారిశుద్ధ్యం పనులు నిర్వహిస్తున్న కార్పొరేటర్ శర్వాణి మూర్తి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా డివిజన్లో పారిశుద్ధ్యం ఇబ్బంది లేకుండా ప్రజలకు సోమవారం నుంచి సమ్మె ముగిసే దాకా నా సొంత నిధుల నుంచి 20 మంది కార్మికుల్ని రోజువారి వేతనం ఇచ్చి డివిజన్లో పారిశుద్ధ పనులను ప్రజలకు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించడానికి వారందరినీ కూడా ఈరోజు నుంచి మన డివిజన్లో నియమించుకోవడం జరిగిందని సత్యనారాయణపురం, 33 డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శర్వాణి మూర్తి మాట్లాడుతూ ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మీ చెత్తని రోడ్లమీద విసిరి వేయకండి మీ ఇంటి దగ్గరికి వెహికల్ పంపిస్తాం. ఎటువంటి అసౌకర్యం కలగకుండా మీకు నేను అందుబాటులో ఉంటానన్నారు. అదేవిధంగా ఒకవేళ మీ దగ్గర ఎక్కువ చెత్త ఉంటే దయచేసి నా నెంబర్ కి 9866085262 కి నాకు ఫోన్ చేసి చెప్తే నేను అధికారుల ద్వారా మీకు అక్కడికి వర్కర్స్ ని పంపించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కొంతమంది వెహికల్స్ మీద బళ్ళమీద వచ్చి పక్క డివిజన్స్ నుంచి కూడా మన ఏరియాలో ఉన్న ఖాళీ స్థలాలు తెర చెత్త విసిరి వేస్తున్నారు అటువంటివారిని ఆ వెహికల్స్ ట్రేస్ చేసి అధికారుల ద్వారా వారి మీద చర్యలు తీసుకోబడతాయని కూడా హెచ్చరిస్తున్నాం దయచేసి రోడ్లనేవి కానీ పరిసరాలనేవి కానీ మనందరికీ సంబంధించింది పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఎటువంటి రోగాలు రావు కాబట్టి ప్రజలందరూ ఈ విషయంలో సహకరించవలసిందిగా కోరుకుంటున్నానన్నారు. కావున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి రోడ్లమీద చెత్త వేయొద్దు దయచేసి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ నిర్ణయానికి స్థానికులు అభినందిస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *