Breaking News

వికసిత భారత్ సంకల్పయాత్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 9 నుండి 11వ తేదీ వరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాద యశో నాయక్ పాల్గొంటున్న వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో డిఆర్వో పెద్దిరోజా, ఉయ్యూరు ఆర్డిఓ పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ డి రాజు, ముడా విసి రాజ్యలక్ష్మిలతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం పరిశీలించేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీపాద యశోనాయక్ ఈనెల 9వ తేదీన జిల్లాకు వస్తున్నారన్నారు. ఆరోజు మధ్యాహ్నం 2-30 గంటలకు గుడ్లవల్లేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అలాగే 10 తేదీన ఉదయం కోడూరు మండల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో, మధ్యాహ్నం పామర్రు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, 11వ తేదీన బంటుమిల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. జిల్లాలోని సంక్షేమ శాఖల అధికారులు, సంబంధిత ఇతర అధికారులు, ఆర్డీవోలు తహసిల్దార్లు, ఎంపీడీవోలతో జిల్లా పంచాయతీ అధికారి సమన్వయం చేసుకొని కేంద్ర మంత్రి పర్యటన కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ ప్రజల విజ్ఞప్తులను ఎంతో ఓపిగ్గా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఇందులో కొన్నింటి అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి.

అవనిగడ్డ మండలం సచివాలయం-4 పరిధిలోని బంధలాయి చెరువు నివాసి కొండవీటి వెంకట శేషుబాబు మాట్లాడుతూ తనకు రీ సర్వే నంబరు 442/11 లో 0.07 సెంట్ల వ్యవసాయ భూమి ఉందని, దానిలో కొంత భాగం దారి కలదని, సర్వే చేసి తన పొలానికి పట్టాదారు పాసు పుస్తకము మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

విజయవాడలో నివాసం ఉంటున్న సుగుణ రత్నం తనకు నందివాడ గ్రామం చిన్న లింగాల సర్వేనెంబర్ 428, 135/7 లో 0.28 సెంట్ల వ్యవసాయ భూమి కలదని ఆ భూమి 22 ఏ లో ఉంచారని సర్వే కోసం అర్జీలు ఇచ్చామని సర్వేయర్ రాలేదని తన భూమిని 22 ఏ నుంచి తొలగించాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు.

తొట్లవల్లూరు మండలం గరికపర్రు గ్రామానికి చెందిన వల్లూరు చిన్న అంకాలు మాట్లాడుతూ తమ గ్రామంలో రహదారికి ఇరువైపులా కొందరు గేదెలు కట్టేయడం, గడ్డివాములు పెట్టుకోవడం, చెరుకు సీజన్ కావడంతో చెరుకు బండ్లు, ట్రాక్టర్లు అడ్డంగా పెట్టుకున్నారని దీంతో గ్రామస్తులకు రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుందని వాటిని తొలగించి రాకపోకలకు వీలు కల్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ డ్వామా పీడీలు పి ఎస్ ఆర్ ప్రసాద్, సూర్యనారాయణ, డి.ఎస్.ఓ పార్వతి, డి ఎం హెచ్ ఓ డాక్టర్ గీతా బాయి, డీఈఓ తహేరా సుల్తానా, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, డిపిఓ నాగేశ్వర నాయక్, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, ఐ సి డి ఎస్ పి డి సువర్ణ, ఉద్యాన అధికారి జ్యోతి, జిల్లా పశుసంవర్ధక అధికారి శ్రీనివాసరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *