Breaking News

షూటింగ్‌లో జాతీయ‌స్థాయి స్వ‌ర్ణ ప‌త‌క విజేత త‌మ‌న్యుకు కలెక్ట‌ర్ అభినంద‌న‌లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2023, డిసెంబ‌ర్ 27 నుంచి 2024, జ‌న‌వ‌రి 1 వ‌ర‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌లో జ‌రిగిన 67వ జాతీయ స్కూల్ గేమ్స్ ఛాంపియ‌న్‌షిప్ షూటింగ్ విభాగంలో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన విజ‌య‌వాడకు చెందిన 12 ఏళ్ల త‌మ‌న్యు సిరంగినిని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అభినందించారు. త‌మ‌న్యు సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావును మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ త‌మ‌న్యు భ‌విష్య‌త్తులోనూ జాతీయ‌, అంత‌ర్జాతీయ పోటీల్లో స‌త్తా చాటి.. ప‌త‌కాలు కైవ‌సం చేసుకోవాల‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం గౌర‌వ ముఖ్య‌మంత్రి నేతృత్వంలో క్రీడారంగ అభివృద్ధికి కూడా అత్యంత ప్రాధాన్య‌మిస్తోంద‌ని.. ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకొని ఉన్న‌తంగా ఎద‌గాల‌ని సూచిస్తూ త‌మ‌న్యుకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. కోచ్ ఎం.సుబ్ర‌మ‌ణ్యేశ్వ‌ర‌రావును కూడా క‌లెక్ట‌ర్ అభినందించారు. రాష్ట్రానికి చెందిన మ‌రో ఇద్ద‌రు క్రీడాకారుల‌తో క‌లిసి త‌మ‌న్యు నేష‌న‌ల్ ఛాంపియ‌న్‌షిప్‌లో అండ‌ర్‌-14 టీమ్ ఈవెంట్‌లో 1229.9 పాయింట్లు సాధించి స్వ‌ర్ణం సాధించిన‌ట్లు కోచ్ తెలిపారు. అదే విధంగా అండ‌ర్‌-14 కేట‌గిరీలో వ్య‌క్తిగ‌త విభాగంలో 412.9 స్కోర్ సాధించి జాతీయ‌స్థాయిలో నాలుగో స్థానం కైవ‌సం చేసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. తమన్యు విజ‌య‌వాడ ఫిట్‌జీ ఇంట‌ర్నేష‌న‌ల్‌లో ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. త‌మ‌న్యు తండ్రి ప్ర‌దీప్ ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేస్తున్నారు. అభినందన కార్య‌క్ర‌మంలో డి ఆర్ ఓ ఎస్ వి నాగేశ్వరరావు, జిల్లా ప‌శుసంవ‌ర్థ‌క అధికారి డా. కె.విద్యాసాగ‌ర్‌, కోచ్ ఎం.సుబ్ర‌మ‌ణ్యేశ్వ‌ర‌రావు, త‌మ‌న్యు త‌ల్లి చంద‌న త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *