Breaking News

జిల్లాస్థాయి స్పందనలో 161 ఆర్జీలు నమోదు..

– అర్జీల‌ను నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించాలి: జిల్లా కలెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాస్థాయి జ‌గ‌న‌న్న‌కు చెబుదాం-స్పందన కార్య‌క్ర‌మంలో వ‌చ్చిన ప్ర‌తి అర్జీని క్షుణ్నంగా ప‌రిశీలించి.. నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, డీఆర్‌వో ఎస్.వి నాగేశ్వరరావులు ఆర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.
స్పందనలో 161 అర్జీలు నమోదు కాగా వీటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి 84, పోలీస్ శాఖ‌కు సంబంధించి 19 అర్జీలు వ‌చ్చాయి. పంచాయ‌తీరాజ్‌-7, పౌర స‌ర‌ఫ‌రాలు-6, హౌసింగ్‌-5 అర్జీలు వ‌చ్చాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో స్వీకరించిన ఆర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం లేకుండా ఆర్జీదారుడు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కరం ఉండాలన్నారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. స్పందనలోనే కాకుండా జగనన్నకు చెబుదాం పోర్టలో నమోదు అవుతున్న ఆర్జీలను కూడా అధికారులు ఎప్పటికప్పడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఆర్జీదారుల వినతులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా, జ‌వాబుదారీత‌నంతో విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు. స్పంద‌న‌లో వివిధ శాఖ‌ల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *