Breaking News

ఎన్నిక‌ల సంఘం క‌ల్పించిన హోం ఓటింగ్‌ను స‌ద్వినియోగం చేసుకోండి

– ఈ అవ‌కాశాన్ని వినియోగించుకునేందుకు పీడ‌బ్ల్యూడీ మార్కింగ్ త‌ప్ప‌నిస‌రి
– ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌లో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాలి
– విభిన్న ప్ర‌తిభావంతులు, వ‌యోవృద్ధుల స్వీప్ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్య వ్య‌వస్థ‌లో ఓటు అతి ముఖ్య‌మైన‌ద‌ని.. వ‌యోవృద్ధులు, విభిన్న ప్ర‌తిభావంతుల సౌక‌ర్యార్థం భార‌త ఎన్నిక‌ల సంఘం క‌ల్పించిన హోం ఓటింగ్ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు కోరారు.
సోమ‌వారం శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ‌మందిరంలో భార‌త ఎన్నిక‌ల సంఘం-సిస్ట‌మాటిక్ ఓట‌ర్స్ ఎడ్యుకేష‌న్ అండ్ ఎల‌క్టోర‌ల్ పార్టిసిపేష‌న్ (స్వీప్‌) కార్య‌క్ర‌మంలో భాగంగా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అధ్య‌క్ష‌త‌న జిల్లా విభిన్న ప్ర‌తిభావంతులు, టీజీ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో వ‌యోవృద్ధులు, విభిన్న ప్ర‌తిభావంతుల‌కు ఓటు హ‌క్కు ప్రాధాన్య‌త‌, ఓటు న‌మోదు, పీడ‌బ్ల్యూడీ (ప‌ర్స‌న్స్ విత్ డిజ‌బిలిటీ) మార్కింగ్‌, హోం ఓటింగ్ త‌దిత‌రాల‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం 40 శాతం, అంత‌కంటే అధిక వైక‌ల్య‌మున్న వారికి, 80 ఏళ్లు, ఆపై వ‌య‌సున్న వ‌యోవృద్ధుల‌కు ఇంటిద‌గ్గ‌రి నుంచే ఓటు వేసే హోం ఓటింగ్ సౌక‌ర్యాన్ని అందుబాటులో ఉంచింద‌ని తెలిపారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం ముఖ్య‌మ‌ని.. విభిన్న ప్ర‌తిభావంతులు, వ‌యోవృద్ధులు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్ మార్గాల‌తో పాటు బీఎల్‌వోల ద్వారా త‌మ ఓటు వివ‌రాలు తెలుసుకోవాల‌న్నారు. ఒక‌వేళ ఓటు న‌మోదు కాకుంటే వెంట‌నే న‌మోదు చేయించుకోవాల‌న్నారు. 40 శాతం, అంత‌కంటే అధిక వైక‌ల్య‌మున్న వారు, 80 ఏళ్లు, ఆపై వ‌య‌సున్న వ‌యోవృద్ధులు ఇంటిద‌గ్గ‌రి నుంచే హోం ఓటింగ్ సౌక‌ర్యాన్ని వినియోగించుకునేందుకు త‌ప్ప‌నిస‌రిగా ఫారం 8 స‌హాయంతో పీడ‌బ్ల్యూడీ మార్కింగ్ చేయించుకోవాల‌ని సూచించారు. ఈ అంశంపై విభిన్న ప్ర‌తిభావంతులు, వ‌యోవృద్దుల సంక్షేమ సంఘాలు త‌మ స‌భ్యుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలన్నారు. జిల్లాలో హోం ఓటింగ్ విధానాన్ని పూర్తిస్థాయిలో ప‌టిష్టంగా అమ‌లుచేసేందుకు ఏర్పాట్లు చేయ‌నున్నామ‌ని.. సిబ్బందికి శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. పోలింగ్, భ‌ద్ర‌తా సిబ్బంది ఉన్న ప్ర‌త్యేక బృందం హోం ఓటింగ్‌లో భాగ‌స్వామ్య‌మ‌వుతుంద‌ని.. వీడియోగ్ర‌ఫీ కూడా చేయ‌డం జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. త్వ‌ర‌లో ఓటు, పోలింగ్ స్టేష‌న్ వివ‌రాల‌ను తెలియజేసేందుకు ప్ర‌త్యేక డ్రైవ్ చేప‌ట్ట‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు. కార్య‌క్ర‌మంలో జిల్లా విభిన్న ప్ర‌తిభావంతులు, టీజీ, వ‌యోవృద్ధుల సంక్షేమ శాఖ స‌హాయ సంచాల‌కులు వి.కామ‌రాజు, జిల్లా యువజ‌న సంక్షేమ అధికారి, స్వీప్ నోడ‌ల్ అధికారి యు.శ్రీనివాస్‌ల‌తో పాటు సీనియ‌ర్ సిటిజ‌న్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ వేమూరి బాబూరావు, కార్య‌ద‌ర్శి ఎం.వెంక‌టేశ్వ‌ర‌రావు, విజువ‌ల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ర‌వీంద్ర‌బాబు, విభిన్న ప్ర‌తిభావంతులు, వ‌యోవృద్ధుల సంక్షేమ సంఘాల ప్ర‌తినిధులు బి.ర‌మేష్‌, ఎస్‌కే చాన్‌బీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *