Breaking News

ఈ నెల 9, 10 తేదీల్లో ఈసీఐ ఉన్న‌త‌స్థాయి బృందం విజ‌య‌వాడ ప‌ర్య‌ట‌న‌

– 9వ తేదీన గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం
– ఎస్ఎస్ఆర్‌-2024, ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త ప్ర‌ణాళిక‌పై క‌లెక్ట‌ర్లు, ఎస్‌పీల ప్ర‌జెంటేష‌న్‌
– రాష్ట్ర ఉన్న‌తాధికారుల‌తోనూ ఈసీఐ బృందం స‌మావేశం
– స‌ద‌స్సు విజ‌య‌వంతానికి పూర్తయిన ఏర్పాట్లు: జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక సంక్షిప్త స‌వ‌ర‌ణ-2024, ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త కార్య‌క‌లాపాల‌పై విజ‌య‌వాడ‌లో ఈ నెల 9, 10 తేదీల్లో భార‌త ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ) ఉన్న‌త‌స్థాయి స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని.. వీటిని విజ‌య‌వంతం చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.
ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక సంక్షిప్త స‌వ‌ర‌ణ, ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ స‌న్న‌ద్ధ‌త కార్య‌క‌లాపాల‌పై జ‌ర‌గ‌నున్న స‌మావేశాల‌కు చేస్తున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించేందుకు ఏపీ చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాతో క‌లిసి జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు సోమ‌వారం విజ‌య‌వాడ‌, నోవాటెల్ కాన్ఫ‌రెన్స్ హాల్‌ను ప‌రిశీలించారు. చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్‌, ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయ‌ల్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఉన్న‌తాధికారుల బృందం నేతృత్వంలో జ‌రిగే స‌మావేశాలు స‌జావుగా సాగేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు. స‌మావేశ మందిరంలో సీటింగ్, అడ్రెసింగ్ సిస్ట‌మ్, భద్రత త‌దిత‌ర ఏర్పాట్ల‌ను ప్ర‌ణాళికాయుతంగా చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. స‌మావేశాల‌కు హాజ‌రుకానున్న ఉన్న‌తాధికారుల‌కు ర‌వాణా, బ‌స‌, వ‌స‌తి ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు. జ‌న‌వ‌రి 9వ తేదీ ఉద‌యం 10 గంట‌ల నుంచి 12 గంట‌ల వ‌ర‌కు గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం జ‌ర‌గ‌నుంద‌ని.. మధ్యాహ్నం అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్‌పీలు ఆయా జిల్లాల‌కు సంబంధించి ఎస్ఎస్ఆర్‌-2024 కార్య‌క‌లాపాలు, ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త ప్ర‌ణాళిక‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. జ‌న‌వ‌రి 10వ తేదీన రాష్ట్ర చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్‌, స్టేట్ పోలీస్ నోడ‌ల్ ఆఫీస‌ర్‌, సీఏపీఎఫ్ నోడ‌ల్ ఆఫీస‌ర్ త‌దిత‌రుల‌తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల‌తో స‌మావేశం ఉంటుంద‌న్నారు. అనంత‌రం రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి, రాష్ట్ర డీజీపీ, వివిధ శాఖ‌ల కార్య‌ద‌ర్శుల‌తో ఈసీఐ ఉన్న‌తాధికారులు సమావేశ‌మ‌వుతార‌న్నారు. ఈసీఐ బృందం రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా 10వ తేదీ సాయంత్రం 4.30 గంట‌ల నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు మీడియా స‌మావేశం ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. ఈ స‌ద‌స్సును విజ‌య‌వంతం చేసేందుకు నోడ‌ల్ అధికారులు, స‌మ‌న్వ‌య, స‌హాయ స‌మ‌న్వ‌య అధికారుల‌ను నియ‌మించిన‌ట్లు తెలిపారు. క‌లెక్ట‌ర్ వెంట జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంపత్ కుమార్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ అదితిసింగ్ త‌దిత‌రులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *