– కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా అందిన జాబితా అనుసరించి జర్నలిస్టు ల కు అనుకూలమైన ప్రాంతంలో ఇళ్ళ స్థలాల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చెయ్యడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల హౌస్ సైట్ అంశంపై కొవ్వూరు సబ్ కలెక్టర్, రాజమహేంద్రవరం ఆర్డిఓ, పాత్రికేయ కమిటీ ప్రతినిధుల సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జర్నలిస్టులకు జిల్లా పరిధిలో అనుకూలమైన ప్రాంతాల్లో స్థల సేకరణ చేపట్టి సాధ్యమైనంత తొందరలో ప్రక్రియ పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం తరపున అప్రమత్తమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమేరకు జర్నలిస్ట్ లతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల కమిషనర్ ద్వారా ఆమోదం పొందిన దరఖాస్తులను పరిశీలించడం జరిగిందన్నారు. సాధ్యమైనంత తొందరలో జర్నలిస్ట్ లకు అనుకూలమైన ప్రాంతంలో స్థలాలు గుర్తించి, భూసేకరణ ప్రక్రియ ద్వారా సమీకరించి అందచెయ్యడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో పాత్రికేయులకి చెందిన కమిటీ సభ్యులు టి. అప్పలనాయుడు, పి వి వి సత్యనారాయణ లు పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకుని రావడం జరిగింది ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఆర్డీవో ఎ. చైత్ర వర్షిణి, డి ఐ పిఆర్వో సిహెచ్. శ్రీనివాస్, డి పిఆర్వో ఐ. కాశయ్య,డి ఎల్ పిఆర్ ఓ ఎం ఎల్ ఆచార్యులు, జర్నలిస్టులు అప్పలనాయుడు, పి వి వి సత్యనారాయణ లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News