Breaking News

అర్జీలను త్వరితగతిన నాణ్యతతో కూడిన పరిష్కరించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన నాణ్యతతో కూడిన పరిష్కరించాలని ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి జిఎఎల్ఎస్. దేవి, అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ఆర్డీవో తరపున ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి శ్రీమతి జిఎఎల్ఎస్. దేవి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిఎఎల్ఎస్. దేవి ప్రజల వచ్చిన ఐదు అర్జీలను స్వీకరించారు. ఈరోజు వ్యవసాయ శాఖ, రెవెన్యూ, శానిటేషన్, త్రాగు నీరు తదితర అంశాలకు సంబంధిచి ఐదుగురు నుంచి అర్జీలను స్వీకరించా మన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం స్పందన, జేకేసి, ఇప్పుడు జగనన్న సురక్ష ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్పొరేషన్, డివిజనల్ పంచాయతీ అధికారి, ఐసిడిఎస్ సివిల్ సప్లైస్, బిసి వెల్ఫేర్, ఏపీఎస్ఆర్టీసీ, హౌసింగ్, ఇరిగేషన్, ఆర్.డబ్ల్యూఎస్, ఫైర్, సాంఘిక సంక్షేమ, వైద్య, ఆరోగ్య, లేబర్, పశుసంవర్ధక, పరిశ్రమలు, డాక్టర్ ఎస్సార్ ఆరోగ్యశ్రీ తదితర డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *