-కమిషనర్ పంచాయతీ రాజ్ సూర్య కుమారి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల జనవరి 18 నుండి 20 వరకు మూడు రోజులు భారత పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ వారి సూచనల మేరకు ఆం.ప్ర రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణపై (LSDGలు) రెండవ థీమ్ అయిన ఆరోగ్యకరమైన గ్రామం (హెల్తీ విలేజ్) అంశంపై జాతీయ వర్క్‌షాప్ నకు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల నుండి మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు, ఇతర అధికారులు స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొననున్నారని, ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీమతి సూర్య కుమారి గారు స్పెషల్ కమీషనర్ స్వామిత్వా సిరి, డైరెక్టర్ వాటర్ సెడ్స్ వెంకట్ రెడ్డి, జెసి శుభం బన్సల్, డిఆర్ఓ పెంచల కిషోర్ డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తో కలిసి సంబంధిత అధికారులతో సదరు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి కార్యక్రమ విజయవంతంపై పలు సూచనలు చేశారు.
మంగళవారం సాయంత్రం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు ఏర్పాట్ల కొరకు పరిశీలించిన అనంతరం సావేరి ఆడిటోరియం నందు రాష్ట్ర పంచాయితీ రాజ్ కమిషనర్ మాట్లాడుతూ పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణపై (LSDGలు) రెండవ థీమ్ అయిన ఆరోగ్యకరమైన గ్రామం (హెల్తీ విలేజ్) అంశంపై జాతీయ వర్క్‌షాప్ నకు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల నుండి మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు, ఇతర అధికారులు స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొననున్నారని, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు వర్క్ షాప్ నిర్వహించబడుతుంది అని అన్నారు. సమావేశ ప్రాంతంలో పబ్లిక్ అడ్రస్ సిస్టం పక్కాగా ఉండాలని, ఎల్ఈడి ఏర్పాటు తగినన్ని ఉండాలని, లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటుసీటింగ్, స్టాల్స్ ఏర్పాటు, వివిధ అంశాలపై గ్రూప్ డిస్కషన్ కు ఏర్పాటు ఉండాలని, వసతి ఏర్పాట్లు సమన్వయంతో చేపట్టాలని, లైజన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, టీటీడీ వారితో తిరుమల శ్రీవారి దర్శన ఏర్పాట్లు సమన్వయం అధికారులు చేయాలని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు శిల్పా రామం నందు ఏర్పాటు చేయాలని సూచించారు. స్పెషల్ కమిషనర్ సిరి గారు మాట్లాడుతూ క్షేత్ర స్థాయి పర్యటన 20వ తేదీన ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ సమయానుసారంగా వస్తున్న ప్రభుత్వ ఆదేశాల మేరకు, కమిషనర్ సూచనల మేరకు సదరు ఏర్పాట్లు ఎలాంటి అలసత్వం లేకుండా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు విధులు కేటాయింపుతో వివిధ కమిటీల నియామకం చేసామని సమన్వయంతో చేపడుతామని వివరించారు.
ఈ కార్యక్రమంలో జీఎం స్మార్ట్ సిటీ చంద్ర మౌళి, పంచాయితీ రాజ్ జాయింట్ కమీషనర్ జనార్ధన్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా సిఈఓ జడ్పీ ప్రభాకర్ రెడ్డి, డిపిఓ రాజశేఖర్ రెడ్డి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఎస్డిసిలు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News