తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 12-01-2024 అనగా శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి మల్లం గ్రామ సచివాలయం, చిట్టమూరు మండలం, తిరుపతి జిల్లా నందు ఐదవ తరగతి పైన చదువుకున్న లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమో లేదా ఏదైనా డిగ్రీ లేదా BTech లో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులకు మినీ జాబ్ మేళా నిర్వహించబడును.
ఈ మినీ జాబ్ మేళాకు హాజరయ్యే కంపెనీల వివరములు:
1: గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగాల కొరకు 5th Class Above, ఐటిఐ డిప్లమా లేదా ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత కలిగిన యువతీ యువకులకు మాత్రమే.
2: యూని చార్మ్ లో ఉద్యోగాల కొరకు పదవ తరగతి పాస్/ఫైల్ లేదా ఇంటర్మీడియట్ పాస్/ఫైల్ లో ఉత్తీర్ణత కలిగిన యువతకు మాత్రమే.
మరిన్ని వివరములకు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింకులో తప్పనిసరిగా నమోదు చేసుకోవలెను.
రిజిస్ట్రేషన్ లింక్: https://skilluniverse.apssdc.in
సంప్రదించవలసిన మొబైల్ నెంబర్:8143576866,8919925219.
ఈ మినీ జాబ్ మేళాకు హాజరయ్యే యువతీ యువకులు తమ ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటు బయోడేటా ఫారం మరియు విద్యార్హత సంబంధించిన సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూలకు హాజరుకావలెను అని తిరుపతి జిల్లా నైపుణ్యాభిృద్ధి సంస్థ అధికారి ఆర్ లోకనాథం గారు మరియు చిట్టమూరు ఎంపిడివో కే షలేట్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
Prajavartha Online Telugu News