Breaking News

ఈనెల 22 న ఓటర్ల తుది జాబితా ప్రచురణ జరగాలి : పోలా భాస్కర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికలకమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల సవరణ -2024 ఓటర్ల తుది జాబితా ఈనెల 22 న ప్రకటించాలని, ప్రకటన అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు మరుసటి రోజే జాబితా అందించాల్సి ఉంటుందని రోల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ సూచించారు.
బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లో అబ్జర్వర్ గా మూడవ సమావేశం జిల్లా కలెక్టర్ తో , ఇ ఆర్ ఓ లతో ఓటర్ల తుది జాబితా ప్రచురణ పై చేపట్టాల్సిన చర్యలపై రోల్ అబ్జర్వర్ పలు సూచనలు చేసారు.
ముందుగా జిల్లా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో ముసాయిదా జాబితా 2023అక్టోబర్ 27 ప్రకటించడం జరిగిందని, అన్ని రకాల ఫారమ్స్ 4,15,235 అందాయని 0.17 శాతం మాత్రమే పరిశీలనలో వున్నాయని మిగిలినవి పరిశీలించి పూర్తి చేసామని అన్నారు. నియోజక వర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు జరిపి ఎస్ ఎస్ ఆర్ -2024 పై సమాచారం ఎప్పటికప్పుడు అందించడం జరుగుతున్నదని అన్నారు. ఈనెల 22 న ఓటర్ల తుది జాబితా ప్రచురణకు జిల్లా యంత్రాంగం సిద్దంగా వుందని వివరించారు.
రోల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ జిలాల్లో అందిన పిర్యాదులు పూర్తిగా పరిష్కరించాలని, తుది జాబితా ప్రచురణ కోసం ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ బీటా వర్షన్ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలుసు తప్పనిసరి ఎ ఇ ఆర్ ఓ లు, ఇ ఆర్ ఓ లు పూర్తిస్థాయిలో మరోసారి పరిశీలించి ఓటర్ల జాబితా, సీరియల్ నెంబర్లు వంటివి నిర్దారణ జరగాలని అన్నారు. నియోజక వర్గాల వారిగా జాబితా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించాలని వారివద్ద తప్పనిసరి రసీదు పొందాలని అన్నారు. ఇక కొత్త ఓటర్లకు కార్డుల ప్రింటింగ్ , పంపిణీ పై ఎన్నికలకమిషన్ అనుమతితో త్వరగా ఓటర్లకు అందించాలని అన్నారు. ప్రతి కొత్త నమోదు , తోలగింపు, మార్పు ఓటర్ల కు సంబంధించి ఫైల్స్ సిద్దంగా వుండాలని, ఎన్నికల కమిషన్ పరిశీలనలో వీటిని పరిశీలిస్తారని అన్నారు.
ఈ సమీక్షలో తిరుపతి నగరపాలక కమిషనర్ హరిత, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఆర్డిఓ లు కిరణ్ కుమార్ , నిశాంత్ రెడ్డి, చంద్రముని, శివశంకర్ రెడ్డి, ఎ ఇ ఆర్ ఓ లు , సెక్షన్ సూపరిన్ టెన్ డెంట్ చంద్ర శేఖర్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *