Breaking News

సామాజిక సాధికారత మన రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యం: తిరుపతి ఎం.పి

-సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మానవహారంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, తిరుపతి ఎం.పి, తిరుపతి మునిసిపల్ కమీషనర్
-డా. బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు అమలు చేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన “సామాజిక సమత సంకల్పం” కార్యక్రమంలో భాగంగా నేడు బుధవారం ఉదయం స్థానిక ఏపీఎస్ఆర్టిసి బస్టాండ్ సర్కిల్ నందు గల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత కలిసి పూలమాల వేసి, మానవహారంలో పాల్గొని మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం డా. బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలతో సామాజిక న్యాయం అమలు చేస్తున్నదని అన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డా. బి.ఆర్ అంబేద్కర్ భావజాలాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని, ఈ నెల జనవరి 19 న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలోని స్వరాజ్ మైదాన్ లో దాదాపు రూ. 400 కోట్లతో సుమారు 20 ఎకరాలలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడస్టల్ తో కలిపి 210 అడుగులు ఉంటుందని ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సామాజిక న్యాయానికి స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో సామాజిక సమతా సంకల్పం లో భాగంగా జిల్లాలో ఈ నెల జనవరి 4 నుండి 19 వరకు వివిధ కార్యక్రమాల నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విగ్రహం విజయవాడ నడి బొడ్డున ఏర్పాటు చేయడంతో ఇది విజయవాడకే కాదు మన యావత్ ఆం.ప్ర రాష్ట్రానికి తలమానికంగా (ఐకాన్ గా) ఉంటుందని తెలిపారు. సచివాలయ స్థాయిలో కూడా వివిధ రకాల వక్తలతో గ్రామస్తులందరికీ వివరించి సమతా భావాన్ని పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అలాగే ప్రతి సచివాలయం నుండి నలుగురు నుండి ఐదు మందిని ఈ నెల జనవరి 19వ తారీకున విజయవాడలో జరిగే డా. బి ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి బస్సు ఏర్పాటు చేసి పంపడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు అంబేద్కర్ భావజాలాన్ని ప్రజలకు తెలియజేసి మన రాష్ట్ర ప్రభుత్వం తదనుగుణంగా అంబేద్కర్ భావజాలంతో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించేలా కార్యక్రమాల రూపకల్పన చేసి అమలు చేస్తున్నామని, ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉన్నదని తెలిపారు.

తిరుపతి ఎం.పి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో నేడు పరిపాలన సాగుతోందని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, వారి కుటుంబాలలో ఆర్థిక స్థిరత్వం, సమానత్వం కోసం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, బి.సి వెల్ఫేర్ అధికారి భాస్కర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌలీశ్వర్ రెడ్డి తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంఘాల ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *