-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ చరిత్రలో సామాజిక న్యాయానికి ప్రతీకగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహాశిల్పం నిలిచిపోతుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. స్వరాజ్ మైదానంలో ఈనెల 19న జరగనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన కార్యాలయం బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. లక్షా 20 వేల మందికి పైగా పాల్గొననున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మల్లాది విష్ణు చెప్పారు. రాజ్యాంగ కర్తగా బీఆర్ అంబేద్కర్ సామాజిక అభివృద్ధికి తగినట్టుగా రాజ్యాంగం రూపొందించారని.. ఆ మహనీయుని స్ఫూర్తితో రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పదవులు కేటాయించి, వారికి సముచిత గౌరవం కల్పించారన్నారు. అటువంటి ముఖ్యమంత్రి చేతులమీదుగా జరుగు ఈ వేడుకకు కుల, మత, వర్గ బేదం లేకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. ఈ మహాశిల్పం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవటం మాత్రమే కాకుండా.. చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల ఏళ్ల పాటు స్ఫూర్తినిస్తుందని చెప్పుకొచ్చారు.
Prajavartha Online Telugu News