Breaking News

అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని విజయవంతం చేయండి – వెలంపల్లి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 19న విజయవాడలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ మహోత్సవం జరుగుతుందని దానిని విజవంతం చెయ్యాలని కోరుతూ మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు స్థానిక బ్రహ్మణ వీధిలో గల వెలంపల్లి గారి ఇంటి వద్ద సెంట్రల్ నియోజకవర్గం కార్పొరేటర్లతో సన్నాహక సమావేశం ఏర్పటు చేశారు ఈ సమావేశానికి పార్లమెంట్ ఇంచార్జ్ కేశినేని శ్రీనివాస్ నానీ విచ్చేసి 19న జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరారు.వెలంపల్లి మాట్లాడుతూ విజయవాడలో ఏ మూల నుంచి చూసినా రాజ్యాంగనిర్మాత అంబేడ్కర్‌ కనిపించే విదంగా నడిపోడ్డులో విగ్రహం ఏర్పాటు చేసారన్నారు.సామాజిక న్యాయానికి వైఎస్సార్‌సీపీ, సీఎం వైఎస్‌ జగన్‌ పెద్దపీట వేసినట్లు తెలిపారు.125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ చరిత్రలో నిలిచిపోయే బహుమానమని పేర్కొన్నారు.భారతజాతి గురించి,మనదేశం గురించి చెప్పాలనుకున్నా మొదట చెప్పాల్సిన పేర్లలో అంబేడ్కర్‌ పేరు ఉంటుందన్నారు.వేలాదిగా ఈ కార్యక్రమానికి తరలి వచ్చి విజయ వంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రూహుల్లా,డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీనివాస్ శైలజ రెడ్డి,కార్పొరేటర్లు ఉద్ధాంటి సునీత సురేష్, కుక్కల అనిత రమేష్,బంక శకుంతల దేవి భాస్కర్,కొండయిగుంట మల్లేశ్వరి,పెనుమత్స శిరీష,బాలి గోవింద్,ఈసరపు దేవి రాజు,ఎండీ షరీనా సుల్తానా ఆఫీజుల్లా, ఉమ్మడి రమాదేవి, మోదుగుల గణేష్ తిరుపతిమ్మా,పార్టీ డివిజన్ ఇంచార్జ్లు ఆత్మకూరి సుబ్బారావు,గుండె సుందర్ పాల్,కనపర్తి కొండా,బెవర నారాయణ,తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *