Breaking News

అంబేడ్కర్ ఆశయాలను ఆచరణలో చూపుదాం

-సామాజిక సమతా సంకల్పం వేదికగా సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం
-కలెక్టరేట్ లో శుక్రవారం కూడా అంబేడ్కర్ ఫోటో ప్రదర్శన
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రత్న డా బిఆర్ అంబేద్కర్ ఆశించిన లక్ష్యాలను చర్చించి వదిలి వెయ్యకుండా వాటిని ఆచరణలో పెట్టడమే ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని, అది మన మందరిపై ఉన్న బాధ్యత అని కలెక్టర్ డా కే. మాధవీలత పిలుపు నిచ్చారు.

జిల్లా కలెక్టరేట్ లో గురువారం డా బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో జిల్లా స్థాయి అంబేడ్కర్ సమ్మేళనంకు ముఖ్య అతిథిగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అంబేడ్కర్ సమ్మేళనం నిర్వహించు కుంటున్నట్లు తెలిపారు.

రాజ్యాంగ రచన చేసిన సందర్భంలో బిఆర్ అంబేద్కర్ ఒక మాట అన్నారు, ఏ నాడైతే తాను రచించిన రాజ్యాంగ ఆచరణ కు రాదో ఆనాడే ఆ రాజ్యాంగాన్ని  చింపి తగలపెట్టే మొదటి వ్యక్తిని అవుతానని పేర్కొనడం జరిగిందన్నారు. రాజ్యాంగాన్ని రచించడం కాదు, ఆచరణలో పెట్టడం ఎంత ముఖ్యమో ఆనాడే ఆయన మనందరికీ తెలియచేయడం జరిగిందన్నారు. రాజ్యాంగం రచన చెయ్యడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం భారత దేశం సంపూర్ణంగా అభివృద్ది సాధించాలన్నదే అంబేడ్కర్ కోరుకున్న ప్రధాన ఆశయం అని మాధవీలత పేర్కొన్నారు. రైతుల, మహిళల, పారిశ్రామిక అభివృద్ధి కోసం కూడా ఎన్నో సూచనలు, సిఫార్సులు చెయ్యడం జరిగిందని అన్నారు. విభిన్న రంగాల్లో ఆయనకు ఉన్న దృక్కోణం తెలియ చేసేలా ఆయన జీవితానికి చెందిన వివిధ ఘట్టాల సమాహారంగా ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశామని తెలిపారు. శుక్రవారం కూడా ఫోటో ప్రదర్శన ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు.

జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, ప్రజల్లో అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తి నింపేలా దేశంలోనే 4వ అతి పెద్ద విగ్రహంగా డా అంబేడ్కర్ నిలవడం జరిగిందని అన్నారు.  రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలోనూ అంబేడ్కర్ విగ్రహాలు ఉన్నా, అందరం గర్వంగా చెప్పుకునేలా అతి భారీ అంబేడ్కర్ విగ్రహన్ని విజయవాడ లో ఏర్పాటు చేయాలని నిర్ణయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు. డా బిఆర్ అంబేద్కర్ ఒక స్పూర్తి ప్రదాత అన్నారు. నేడు చిన్న చిన్న సమస్యలను తట్టుకోకుండా ఆత్మహత్యా చేసుకునే సంఘటనలు చోటు చేసుకుంటూ న్నాయని, అటువంటి వారు అంబేడ్కర్ చరిత్రను తెలుసుకోవడం ద్వారా స్ఫూర్తి పొంది ధైర్యంగా ముందుకు అడుగులు వెయ్యవచ్చు అని అన్నారు. అంబేడ్కర్ జీవితాన్ని తెలుసుకోవడం ద్వారా, వాటిని ఆచరణ సాధ్యం చెయ్యడం వలన మరిందరికో మనం స్ఫూర్తి ఇవ్వగలం అని అన్నారు.

ఈ సందర్భంగా అంబేడ్కర్ రాజ్యాంగ రచనలో భాగంగా సామాజిక వేత్తగా, ఆర్థిక రంగ నిపుణత, సంఘ సంస్కర్త గా, అంటరానితనం , కుల నిర్మూలన  కోసం విశేషమైన కృషి చేసి, ఆదర్శంగా నిలిచారన్నారు. ఆ జీవిత ఘట్టాలను విశేషాలపై  ఈ సందర్భాల వక్తలు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే ఎస్ జ్యోతి, స్థానిక వక్తలు బి జార్జ్ ఆంటోనీ , డా. పి.కోమలి , తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్ , కె కె. సంజీవరావు , తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *