Breaking News

జిల్లాకు చెందిన 17,723 మంది లబ్ధిదారులకు రూ.2,24,52,343 వడ్డీ రాయితీ జమ

-ఎంపీ మార్గాన్ని భరత్ రామ్
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇళ్లు లేని పేదవాని సొంత ఇంటి కల సాకారం కావాలని లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళల ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న అదనపు రుణం పై మొదటి విడత వడ్డీ రాయితీ గా రూ.2.25 కోట్లు జమ చేయడం జరిగిందని ఎంపీ మార్గాన్ని భరత్ రామ్, జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.

గురువారం ఉదయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వర్చువల్ ద్వారా పేద అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారి స్వంత ఇంటి కలను నిజం చేస్తూ “నవరత్నాలు పేదలందరికి ఇళ్లు” లబ్దిదారులకు వడ్డీ రాయతీ జమ చేశారు. కలెక్టరేట్ నుంచి జిల్లా స్థాయి కార్యక్రమంలో ఎంపీ, కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, నవరత్నాలు పేదలందరికీ ఇల్లు నిర్మాణాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం అందచేస్తున్న ప్రోత్సాహం తోపాటు స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు ఇంటి నిర్మాణం కోసం ముందస్తు పెట్టుబడి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందచేస్తున్న ఆర్థిక చేయూత కు అదనంగా ఆయా ఇంటి నిర్మాణం కోసం దశల వారీగా నిర్మాణాలు పూర్తి చేసిన వెంటనే తదుపరి దశ నిర్మాణం కోసం ముందస్తు ఆర్థిక సహాయం అందచేస్తున్నట్లు తెలియ చేశారు. ఇంటి నిర్మాణాలను వేగవంతం చేయాలని సంకల్పంతో పెట్టుబడి పెట్టే మొత్తాన్ని దశల వారీగా లబ్దిదారుల ఖాతాకు జమ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 53,269 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.35 వేలు చొప్పున రూ.186.67 కోట్ల మేర అదనపు రుణ సదుపాయం కల్పించడం జరిగిందని అన్నారు. ఆ రుణాలు తీసుకున్న లబ్దిదారులు తదుపరి దశకు చెందిన ఇళ్ళ నిర్మాణ పురోగతి సాధించిన వారిలో ఇప్పటి వరకూ 17,723 మందికి రు 2,24,52,343 లు మేర తొలి విడత వడ్డీ రాయతీ సొమ్ము ఆయా లబ్దిదారుల ఖాతాకు జమ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్క లబ్దిదారులు సొంత ఇంటి నిర్మాణం చేపట్టడం ద్వారా ప్రభుత్వం అందచేస్తున్న ప్రోత్సాహం ద్వారా ప్రయోజనం పొందచ్చునని మాధవీలత పేర్కొన్నారు.

ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ మాట్లాడుతూ జగనన్న కడుతున్నవి ఇళ్లు కాదు.. అవి ఊళ్లు అనే విధంగా పేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారం కావాలన్న తపనతో రాష్ట్రవ్యాప్తంగా
31 లక్షల పైబిలుకు ఇంటి స్థలాలను ఉచితంగా అందించడమే గాకుండా ఇంటి నిర్మాణానికి గాను  పావలా వడ్డీకే రూ.35వేల చొప్పున బ్యాంకు రుణం కూడా అందిస్తున్న జగనన్న ప్రభుత్వం అందించిందని పేర్కొన్నారు.
పేద అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తూ, వారి స్వంత ఇంటి కలను నిజం చేస్తూ..
“నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు” లబ్ధిదారులకు నేడు వడ్డీ రీయింబర్స్మెంట్ చేస్తున్న మన్నారు.

ఈ సమావేశంలో ఏపి పచ్చదనం, సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 4,07,323 మంది గృహ లబ్ధిదారులకు తొలి విడత ఆరు నెలల కు చెందిన గృహ రుణ సదుపాయం వడ్డీ రాయితీ కింద 46 కోట్ల 90 లక్షలు జమ చేయడం జరిగిందన్నారు. పేదల సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా పేదల సంక్షేమ ప్రభుత్వంగా నిలిచిందని పేర్కొన్నారు.

లబ్ధిదారుల మాటల్లో….

కొవ్వూరు 10 వ వార్డు కి చెందిన పట్టుచేర్ల రత్న కుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను జగనన్న ప్రభుత్వం ఎటువంటి వివక్ష లేకుండా అందచెయ్యడం జరుగుతోందని అన్నారు. తన భర్త కళ్యాణ శ్రీనివాస్ మూడేళ్ల క్రితం మరణించిన వెంటనే తనకు ఎటువంటి సిఫార్సులు లేకుండా వితంతు పెన్షన్ మంజూరు చేయడం జరిగిందన్నారు. జగనన్న తనకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వటమే కాకుండా, ఇంటి నిర్మాణం కోసం రూ 1,80,000 వేలు ఆర్థిక చేయూత, ఉచితంగా ఇసుక, సిమెంట్, సబ్సిడీపై ఐరెన్ ఇచ్చి ఇంటి నిర్మాణానికి భరోసా ఇచ్చారన్నారు. ఇంటి కోసం డ్వాక్రా రుణాము కింద మరో రూ.35 వేలు ఇచ్చారన్నారు. తనకు వితంతు పెన్షన్, తన పిల్లలకు అమ్మఒడి ఇవ్వడం జరిగిందన్నారు. ఎప్పటికీ జగనన్న ముఖ్యమంత్రి గా ఉండాలని నాలాంటి లబ్దిదారులందరం కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. జగనన్న కు కృతజ్ఞతలు తెలిపారు.

రాజానగరం కి చెందిన బత్తిన సత్య తులసి మాట్లాడుతూ, పేద వారి ఇంటి కల సాకారం చేద్దామని నిశ్చయముతో ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా ఇంటిని నిర్మించేందుకు అండగా నిలిచారు . సచివాలయ వ్యవస్థ ద్వారా పేదవారికి, అర్హులకు అండగా నిలిచి, ప్రభుత్వ సహాయం తో పాటు డ్వాక్రా మహిళలకు రుణ సౌకర్యం కల్పించి ఇంటి నిర్మాణం చేసుకునేలా ప్రోత్సాహం ఇస్తూ ప్రతి అడుగులో మహిళలకు జగనన్న తోడుగా నిలిచారన్నారు. ఇంటి నిర్మాణం కోసం ఇచ్చిన అదనపు రుణం కోసం చెల్లించిన వడ్డీని కూడా మాఫీ చేస్తూ ఒక అన్నగా మాకు తోడు నిలిచారు. ఉచితంగా ఇసుక ఇవ్వడం, సబ్సిడీపై సిమెంట్, ఇనుము ఇవ్వటమే కాకుండా, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో తీసుకుని రావడం జరిగిందన్నారు. పేదల కోసం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగనన్న నే ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలని, ఆయన్నే గెలిపించుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అద్దె భారం లేకుండా సొంత ఇంటి కల నిజం చేసిన ఏకైక నాయకుడు జగన్ అన్న మాత్రమే అన్నారు. తమ వంటి పేద కుటుంబాల సొంత ఇంటి కల సాకారం చేస్తున్న శాసన సభ్యులు జక్కంపూడి రాజాకు, జిల్లా కలెక్టర్ కు, హౌసింగ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

సమావేశంలో డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర గ్రీన్ బ్యూటీఫికేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హంద్రీనీవా జలాలకు సీఎం జల హారతి

-కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ప్రత్యేక పూజలు -బీరగానిపల్లె రిజర్వాయర్ శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *