Breaking News

కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించిన రక్త దాన శిబిరం

-రక్త దానం చేసిన జేసీ తేజ్ భరత్ , ఇతర అధికారులు
-రక్తం దానం చేసి స్ఫూర్తి నింపిన ప్రతి ఒక్కరూ అభినందనీయులు
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తరుచుగా రక్తదానం మరియు ప్లాస్మాదానం చేయడం ద్వారా జీవితాన్ని పంచవొచ్చునని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు “సామాజిక సమతా సంకల్పం” వేడుకల సందర్భంగా గురువారం ఉదయం కలెక్టరేట్ లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్, జేసీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, విజయవాడ లో 125 అడుగుల భారతరత్న డా॥ బి.ఆర్. అంబేద్కర్ “సామాజిక న్యాయ మహా శిల్పం” ఆవిష్కరణ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్త దానం చేయడం తో పాటు, ప్లాస్మా దానం చెయ్యడం ద్వారా మరొకరి జీవితాన్ని నిలుపు గలుగుతాం అన్నారు. గురువారం రక్తదాన శిబిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, కె ఆర్ ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ నాయక్, ఎయిడ్స్ లెప్రసి నియంత్రణ అధికారి డా ఎన్. వసుంధర , జిల్లా క్రీడా అధికారి బి వివి శేషగిరి రావు, ఇతర జిల్లా అధికారులు, రెడ్ క్రాస్ సభ్యులు, ఎన్ సిసి క్యాండిడేట్స్ తదితరులు రక్తదానం చేయడం జరిగింది .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *