Breaking News

“జనవరి 20 న శనివారం వికాస జాబ్ మేళా”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 20 వ తేదీ శనివారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో మణప్పురం ఫైనాన్సియల్ లిమిటెడ్ లో రిలేషన్షిప్ ఆఫీసర్స్ , మేనేజర్స్ , డెక్కన్ కెమికల్స్ కంపెనీలో ట్రైనీ (ప్రొడక్షన్), విక్టరీ బజార్, బంధన్ బ్యాంకు లో మేనేజర్స్ డి మార్ట్ లో సేల్స్, ప్యాకెర్స్ ఇండోఎం కంపెనీలో టెక్నిషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఉద్యోగాలకు ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐ.టి.ఐ, డిప్లొమో, & డిగ్రీ ఉత్తీర్ణులైన 30 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులు. వీరి అర్హత మేరకు నెలకు రూ.10,000/- నుండి రూ. 30,000/ వరకు జీతం మరియు ఇన్సింటివ్స్, భోజనం, వసతి & రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులందరూ ఈనెల 20 వ తేదీ శనివారం “వికాస కార్యాలయం, కలెక్టరేట్ (బొమ్మూరు హార్లీక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా) రాజమహేంద్రవరం” వద్ద ఉదయం 9.30 గంలకు విద్యా అర్హతల సర్టిఫికెట్స్ జెరాక్స్ ల తో నేరుగా హాజరుకావలెనని తెలిపారు. మరిన్ని వివరాలకు www.vikasajobs.com లేదా ఫోన్ నంబర్ 7660823903 ను సంప్రదించ వలెనని ఆయన ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *