రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి రెవెన్యూ రీ సర్వే, పిఎంజి , స్త్రీ శిశు సంక్షేమం, ఆరోగ్యం పై కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాధవీలత ఇతర అధికారులు కలెక్టర్ ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత జిల్లా ప్రగతిపై సమగ్ర నివేదికను వివరిస్తూ, తెలిపారు.
రీ సర్వే లో భాగంగా 3 దశ లో చేపట్టవలసిన 90 గ్రామాల్లో గ్రామ , మండల స్థాయి లో 100 శాతం లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. ఆర్ వో ఆర్ 82 గ్రామాల్లో పూర్తి చేశామని మిగిలిన 8 గ్రామాల్లో పురోగతిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అంగన్వాడీ సమ్మె కారణంగా జిల్లా పరిధిలోని 1556 అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు, 45 కేంద్రాలు అంగన్వాడీల ద్వారా నిర్వహిస్తుండగా, మిగిలిన 1511 కేంద్రాలు ఇతర శాఖల ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 7 నెలల నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు టి హెచ్ ఆర్ 16390 మందికి గాను 16,271 మందికి అందజేసినట్లు తెలిపారు. 3 నుంచి 6 ఏళ్ల లోపు ఉన్న 44675 పిల్లలకి గాను “ఈ సాధన” కోసం 100 శాతం లక్ష్యాలు సాధించినట్లు తెలియచేశారు.
జగనన్న ఆరోగ్య సురక్ష 2 వ విడత లో ఇప్పటి వరకు 55 క్యాంప్స్ నిర్వహించి 22755 మందికి వైద్య సేవలు అందించినట్లు పేర్కొన్నారు. జే ఏ ఎస్ తొలి విడత లో 6816 మందికి తదుపరి వైద్య సేవలు కోసం సిఫార్సు చెయ్యగా 5197 మంది సేవలు పొందినట్లు తెలిపారు. మిగిలిన వారి ఆరోగ్య వివరాలు కోసం వాలంటీర్, వైద్య సిబ్బంది ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, హౌసింగ్ పీడీ జీ. పరశురామ్, ఎస్ ఈ పిఆర్ యస్ బి వి ప్రసాద్, ఎస్ ఈ. ఆర్డబ్ల్యూఎస్ డి. బాల శంకర్, సిపివో ఎల్. అప్పల కొండ, డ్వామా పిడి పి. జగదాంబ, వైద్యాధికారులు డా కె. వేంకటేశ్వర రావు, డా ఎన్. సనత్ కుమారి, డా లక్ష్మి సూర్యప్రభ, డా పీ. ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News