-తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప కవి : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా కవి యోగి వేమన అని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యోగి వేమన జయంతి సందర్భంగా సమావేశ మందిరం నందు యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి, డిఆర్ఓ పెంచల్ కిషోర్ తదితరులు పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వేమన పద్యాలతో జీవిత సత్యాలను ప్రజలకు తెలియజేశారని తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప కవి అని అన్నారు. వేమన పద్యాలు ఆధునిక పరిశోధనలకు ఆధారం అయ్యాయని, సామాన్యులకు సైతం అర్థమయ్యే రేతులో తేలికైన పదజాలంతో వేమన పద్యాలతో తన భావాన్ని ప్రజలకు తెలియజేశారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ వేమన పద్యాల యొక్క గొప్పతనాన్ని , జీవితం స్ఫూర్తిగా తీసుకుని ఆదర్శంగా నిలవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో.. జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News