-ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు తుది ఓటర్ల జాబితా, సాధారణ ఎన్నికల నిర్వహణకు సిబ్బంది డేటాబేస్, సిబ్బంది శిక్షణ ప్రణాళికలు సిద్ధం కావాలి : ఆం.ప్ర. రాష్ట్ర చీఫ్ ఎలెక్టోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, విజయవాడ నుండి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తప్పులు లేని పారదర్శక ఎస్ఎస్ఆర్ 2024 తుది జాబితా ప్రచురణ, సాధారణ ఎన్నికలపై సన్నద్ధత, పలు అంశాలపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి జిల్లా జెసి శుభం బన్సల్ సంబంధిత ఈఆర్వోలతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలలో ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తుది జాబితా రూపొందాలని, ఫారం – 7 ద్వారా అందిన అభ్యంతరాలపై సమగ్ర విచారణ జరిపి తప్పులు లేని ఓటర్ల తుది జాబితా తయారీకి చర్యలు తీసుకోవాలన్నారు. సాధారణ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలని, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే అధికారులు సిబ్బందికి అందరికీ ఎన్నికల ప్రక్రియ నిర్వహణ, నియమ నిబంధనలపై శిక్షణ అందించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి అన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడం కోసం పోలింగ్ కేంద్రాలలో తగిన కనీస వసతులు అందుబాటులో ఉండాలని, పోలింగ్ సిబ్బందిగా నియామకం కోసం ఉద్యోగుల డేటాబేస్ తయారీ పూర్తి కావాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు 25.01.2024న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహణ కోసం చర్యలు చర్యలు తీసుకోవాలని, పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులకు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఇతర అనుబంధ అధికారులకు శిక్షణ కోసం తగిన సమావేశ మందిరాలను, కార్యక్రమ రూప కల్పన చేసుకోవాలని సూచించగా జెసి గారు మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు చేపడతామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఈఆర్ఓ లు శ్రీమతి హరిత, కోదండ రామిరెడ్డి, శ్రీనివాసులు, నిషాంత్ రెడ్డి, చంద్రముని, ఎలక్షన్ తహశీల్దార్ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News