తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిలు/ మోడల్ కెరీర్ సెంటర్లు ఇంటర్నెట్ సెంటర్లు/ మొబైల్ ద్వార కూడా పొంద వచ్హును మరియు ప్రస్తుతం అందుతున్న సేవలన్నింటిని భారత ప్రభుత్వ నేషనల్ కెరీర్ సర్వీస్ ( ఎన్సీఎస్) పోర్టల్ తో ఆన్లైన్ లో అనుసంధానించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను శనివారం స్ధానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్, తిరుపతి వారు ఆవిష్కరించారు. ఈ ఆన్లైన్ (Online) సేవలు ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్, రెన్యువల్, అదనపు అర్హతలు నమోదు సులభ రీతిన https://employment.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన యెడల వారికి లాగిన్ వివరాలు, తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ వెంటనే ఎస్సెమ్మెస్ ద్వారా పండం జరుగుతుందని, సంబంధిత జిల్లా అధికారి వారి అభ్యర్థనను ఆమోదించిన తర్వాత వారికి ఎస్సెమ్మెస్ ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియజేయడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ కార్డ్ ను లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. సందేహాలకు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ఫోన్ 9441460041 నెంబర్ కు సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ ఆఫీసర్ పెంచల కిషోర్ మరియు , సబ్ – ఎంప్లాయిమెంట్ అధికారి, తిరుపతి ఎస్ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News