-పరిశీలించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం రాత్రి ప్రజలతో కళకళలాడుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం నీ దగ్గరుండి పరిశీలించారు.
ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ మాట్లాడుతూ ప్రజలందరూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని సందర్శించాలని, ఆ మహాత్ముని మహోన్నత్యాన్ని తిలకించాలని అన్నారు. .
విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం ఖచ్చితంగా ప్రజలందరూ సందర్శించే ఒక అద్భుతమైన ప్రదేశమని, కేవలం సంతోషం ఆనందం మాత్రమే కాకుండా విజ్ఞానం ప్రజలకు చేకూరుస్తుందని తెలిపారు. ప్రజలందరూ ప్రత్యేకించి పిల్లలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చరిత్రలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలను తనివితీరా చూడాలని కమిషనర్ అన్నారు.అక్కడికి వచ్చిన చిన్నారులతో మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి తెలుసుకోవడం ఎలా అనిపించింది అని అడిగారు. వారి జీవితాశయం ఏంటని అడగగా. తాము కమిషనర్ గారిల ఐఏఎస్ అవుతామన్నారు.
Prajavartha Online Telugu News