Breaking News

రహదారి భద్రతకు చెందిన కరపత్రాలను గోడపత్రిక బ్యానర్ లను విడుదల చేసిన జిల్లా కలెక్టర్

-త్రాగి వాహనాలు నడపడం నేరం- ట్రాఫిక్ నియమాలు పాటించండి: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
త్రాగి వాహనాలు నడపరాదని అది వారి ప్రాణానికే కాదు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం అని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని అది వారి ప్రాణాలకు రక్షణగా ఉంటుందని అన్నారు.

ఈ నెల జనవరి 20 నుండి ఫిబ్రవరి19 వరకు 35వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు 2024 నేపథ్యంలో శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు రహదారి భద్రత పై కరపత్రాలు, గోడపత్రిక, బ్యానర్ లను కలెక్టర్ గారు డిటిసి గా పదోన్నతి పొందిన సీతారామి రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ రెడ్డి మరియు సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్రాగి వాహనాలు నడపరాదని అది వారి ప్రాణానికే కాదు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం అని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని అది వారి ప్రాణాలకు రక్షణగా ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలని, రహదారి ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి సకాలంలో తరలించి వారి ప్రాణాలను కాపాడాలని, ఇందులో భయపడాల్సిన పని లేదని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *