విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 170 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు పొలిటికల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పోటీ చేయుచున్నామని జాతీయ అధ్యక్షులు తాడివాక రమేష్ నాయుడు తెలిపారు. ఈ ఫ్రంట్‌లో అనేక బహుజన దృక్పథం కలిగిన పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాల కలయికలో ఈ ఫ్రంట్ ఏర్పడిరదని వైసీపీ, టీడీపీ,ి జేఎస్పీలకు ప్రత్యామ్నాయంగా జనాభా ప్రాతిపదికన రాజ్యాధికార సాధన కోసం ఉద్యమిస్తుందని తెలిపారు. ఫ్రంట్ జాతీయ సలహాదారు కన్వీనర్, రాజ్యాధికార పార్టీ జాతీయ అధ్యక్షుడు వి.జి.ఆర్.నారగోని మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని ఏకదాటిగా రెండు అగ్రకుల ఆదిపత్య పార్టీలు పరిపాలిస్తున్నాయన్నారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో పలు వక్తలు మాట్లాడుతూ 85 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలు, రాజకీయ బానిసలుగా మార్చి వేయబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పెద్దన్న పాత్ర పోషించాలని రాష్ట్ర కాపునాడు కన్వీనర్ గిద్దా శ్రీనివాసరావు నాయుడు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాన్ని పోటీ చేస్తున్నారని, జేఎస్పీ పార్టీకి 75 అసెంబ్లీ 10 పార్లమెంట్ స్థానాల్ని 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి పవన్‌కళ్యాణ్‌కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పవర్ షేరింగ్ ఇస్తే కాపునాడు క్రియాశీలక పాత్ర పోషించి కూటమి విజయానికి కాపునాడు పొలిటికల్ ఫ్రెంట్ ఏర్పడుతుందని, అప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రంకె అయ్యన్నబాబు, జై భారత్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ కాట్రగడ్డ సత్యవతి, విజయవాడ మాజీ మేయర్ తాడిశకుంతల, కాపునాడు మహిళా కన్వీనర్ సిరిశాల శోభారాణి, తారకరామ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News