Breaking News

విద్యుత్ ఉద్యోగుల 9 వ ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపిఈపిడిసిఎల్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సర్కిల్ విద్యుత్ ఉద్యోగుల 9 వ ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ “ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ’ రాజమహేంద్రవరం నందు శనివారం (20/01/2024) నుండి నిర్వహిస్తున్నట్లు సూపెరింటెండింగ్ ఇంజనీర్, ఆపరేషన్, రాజమహేంద్రవరం సర్కిల్, టి.వి.ఎస్.ఎన్. మూర్తి ఒక ప్రత్రికా ప్రకటనలో తెలిపారు.

శనివారం ఉదయం 9.00 గంటలుకు ప్రొఫెసర్ కె. పద్మ రాజు , వైస్ ఛాన్స్ లర్, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం సూపెరింటెండింగ్ ఇంజనీర్, టివి ఎస్ ఎన్ మూర్తి 9 వ ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ను ప్రారంభించారన్నారు. ఈ క్రీడా పోటీలలో రాజమహేంద్రవరం సర్కిల్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు అందరూ పాల్గొనడం జరిగిందన్నారు.

షటిల్ బ్యాడ్మింటన్ ఉ .11:30 గంటలకు బ్యాడ్మింటన్ కోర్ట్, గెయిల్ ఆఫీస్ వెనుక వైపు, ఏ వి అప్పారావు రోడ్, రాజమహేంద్రవరం. అదే విధంగా క్రికెట్ పోటీలు శనివారం సాయంత్రం 06.00 గంటల నుండి కాకినాడ వద్ద గల రామేశ్వరం గ్రామంలో జరుగును. మహిళల విభాగం అంశాలకు సంబంధించిన ఆటల పోటీలు అన్ని కుడా ది. 22.01.2024 న సోమవారం సర్కిల్ ఆఫీస్, రాజమహేంద్రవరం నందు ఉదయం 09.00 గంటల నుండి జరుగును.

మిగిలిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అన్ని కూడా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమహేంద్రవరం నందు శని, ఆది వారాల్లో జరుగుతాయని సూపెరింటెండింగ్ ఇంజనీర్, ఆపరేషన్, రాజమహేంద్రవరం సర్కిల్ టి.వి.ఎస్.ఎన్. మూర్తి తెలిపారు.

రాజమహేంద్రవరం అర్బన్ డివిజన్ , రాజమహేంద్రవరం రూరల్ డివిజన్, రంపచోడవరం డివిజన్, రామచంద్రపురం డివిజన్, అమలాపురం డివిజన్, కాకినాడ డివిజన్, పెద్దాపురం డివిజన్, జగ్గంపేట డివిజన్, రాజమహేంద్రవరం సర్కిల్ ఆఫీస్ ఎంఆర్టి డివిజన్ లకు ఈ పోటీలలో పాల్గొoటున్నాయని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *